పుట:2015.372978.Andhra-Kavithva.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

ఆంధ్ర కవిత్వచరిత్రము

తృతీయ


నట్టి ప్రతి క్రియనే శాస్త్రములు విధించుచున్నవి. అట్టికోరికల, వలన ణీతరులకు బాధ జనింపకుండుటకై శాస్త్రములు మానవుఁ డనుసరింపవలసిన విధులను నిర్ణయించును. అట్టివీధ్యు క్తమార్గానుసరణమే కర్మమార్గము, కర్మ యోగము నను పేర్లఁ బరఁగు చున్నది. “శాసతీతి శాస్త్రం” అనుసంస్కృత వ్యాఖ్య ప్రకారము శాస్త్రమునకు శాసనాధికారము కలదని మనశాస్త్రజ్ఞు లంగీక రించియున్నారు. అట్టిశాసనముల నన్నిటిని క్రోడీకరించి ధర్మ శాస్త్రము, నీతి శాస్త్ర మాదిగాఁగలశాస్త్రముల రచించి “ధర్మ:* మను పేర మానవధర్మమునఁ జొప్పించి యున్నారు. ప్రప్రథమ మున ధర్మము పేర్కొనఁబడియుంటచేఁ బ్రతివానికిని ధర్మాచరణము ముఖ్యమనియుఁ, దసమూలముగ నితరులకు బాధ కలుగఁ గూడదనియు, మనవారు బోధించిరి. శాస్త్రము నైచ్ఛికముగా వదలినచో నెల్ల రుసు శాస్త్రమును మీటియే సంచరింతురు. కావున నే మనజీవితమున ననుసరింపఁదగినవిధులను నిర్ణయించు రోజుకును, మసకోరిక లితరులను బాధింపకుండుటకును నొక శాస్త్రమును నిర్మించి యధికారరీత్యా మనజీవితముల సామర స్యముఁ గల్పింపఁ జూచినారు. ఈశాస్త్ర జూలము నే మనవారు ధరార్థ కామమోక్షసంయుతమగు మానవధర్మమునఁ బ్రప్రథమ మునఁ బేర్కొనినారు. విధులవిషయమున శాస్త్ర నిర్దిష్టమగు. ధర్మ మవశ్యాచరణీయము. లేనిచోఁ బ్రపంచమునఁ బరస్పర విరోధమును, వైపరీత్యమును, సంరంభమును సంఘట్టనమును.దప్పవు.