పుట:2015.372978.Andhra-Kavithva.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసము దేని నాశ్రయించికొనును ?

167


శాస్త్రము శామమును శాసింపఁజాలదు.

విధులనయితే ధర్మము నిర్ణయించి యడ్డగింపఁగలడు గాని మానసికములగు కోర్కుల నడ్డగింపఁగలదా? నాకు బ్రపంచమునకంతకును రాజును గావలెననుకోరిక యున్న దను కొందము. ఏశాస్త్రము నన్నడ్డగించును? మనస్సులోఁ బాలుఁద్రావు చో మనల నడ్డగించువా రెవ్వరు? ఆకోరిక ననుసరించి యితరులను బాధింపఁ జొచ్చినయప్పుడే సంరంభము జనించును. అంతవఱకును భయము లేదు. మానసికస్వాతంత్ర్యమును భగవంతుఁడు కూడ నడ్డగింపఁజూలఁడు. అట్టిచో శాస్త్ర మేవిధిని మానసిక స్వాతంత్ర్యము నడ్డగింప గలుగును? మృత్యువున కేమైన నీపని సాధ్యమగు నేమో? ఈశంకకుఁ గూడఁ బూర్వ పక్షమున్నది. ఎట్లన మృత్యుకాలమునఁ గోరిక లున్న చో నాకోరికలఁ దీర్చు కొనుటకొఱకు వేటోకజన్మ మెత్తవలసియుండునని శాస్త్రము, కావున నిచ్ఛాసామ్రాజ్యమునకు మనస్సు సర్వ సర్వంసహాచక్రవర్తి యనఁదగును. కావుసం గ్రియారూప మునఁ బరిణమింపని శుద్దమానసిక వ్యాపారములయం దెల్ల మనస్సునకుఁ బరిపూర్ణస్వాతంత్ర్యము కలదు. శాస్త్రము మన యిచ్ఛాసామ్రాజ్యముపై నధి కారము చలాయింపఁజాలదు.

శాస్త్రము రసమును, గవిత్వమును నిరోధింపఁజాలదు

రసమును, రసానుభూతియుఁ, దదాత్మకమగు కవిత్వ మును శుద్ధమానసిక వ్యాపారములని చిన్న పిల్లలుపై తము గ్రహింపఁగలరు. రసికునకు, రసానుభూతియందునను, కావ్య సందానుభూతియందునను నపూర్వమగుమానసికస్వాతంత్ర్యము కలదని మనమంగీకరింపక తప్పదు. ఇట్టి మానసికస్వాతం .