పుట:2015.372978.Andhra-Kavithva.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162\ఆంధ్ర కవిత్వచరిత్రము

తృతీయ


మనుష్య 'లుండనే యుండరు. బ్రతికినంత కాలము నేవో కోరిక లుండనే యుండును. కోరికలును లేనిస్థితి యేది యున్నదో అవియే ముముక్షుత్వము, ఈశ్వరత్వము. ఏవిధము అయినకోరికలును లేనివాఁ డెవ్వడో అతఁడే ఈశ్వరుఁడు. గోరిక లెప్పుడు కలుగునో అప్పుడే యతఁడు మనుష్యుఁ డగును. చచ్చిపోవు వఱకును, చచ్చిపోవునప్పుడును గూడఁ గోరికలుం డును. స్వర్గమునకుఁ బోవ లెననుకోరిక, తనవంశ మాచంద్ర, తారార్క మభివృద్ధినొందవ లెనను గోరిక, ఇట్టి వెన్నియో మను ష్యున కుండును, "చావు కాలానికి లావు కోరిక” లందురుగదా! విల్లులు మరణశాసనములు) వ్రాసి భవిష్యత్కాలపు సంగతు లనుగూర్చి కట్టుబాటులఁ జేసి చచ్చువా రెందఱు లేరు? అందుల కనియే "తస్తాత్ జూగ్రతజూ,గ్రత" యనుకథలోని వెట్టివాడు జనుల నుద్దేశించి పల్కినశ్లోకములలో

ఆశయా బధ్యతే లోకః కర్మణా బహుచింతయా,
ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత జాగ్రత"

యని యుద్భోధించెను. అనుక్షణ సన్నిహితమృత్యువులయి యుండియుఁ గూడ మనుజు లూరక కోరికలఁ గోరుకొనుచు నాశాబద్దులుగ మృతినొందుచున్నారు. కావున మనుష్యత్వము నకుఁ బ్రథానలక్షణము కోరిక లుండుటయే. దీనినే మనవారు కామముగ నిర్వచించి యున్నారు.

కోరికలు వివిధములు.

కోరికలు వివిధములుగ నుండును. కోరికలలోఁ గొన్ని క్షణికానందము నిచ్చునవియుఁ, గొన్ని శాశ్వతానంద మిచ్చు నవియు నుండును. కోరికలలోఁ దారతమ్యములును నెచ్పు