పుట:2015.372978.Andhra-Kavithva.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసము దేని నాశ్రయించీకొనును!

163


తగ్గులును గోచరించుచుండును. ఎట్లనఁగ: వీధినిఁ బోవుచుండఁగా మనకనుల కెందఱో సుందరులు కనుపింతురు. ఎంత చక్కగా నున్నారు! ఎంత బాగుగానున్నారని సంతసింతుము. కానియిందరి కన్నను మనభార్యలే మన కెక్కువ యందముకల వారుగాఁ గనిపింతు రే! అదియేమి? వీథినిఁ బోవుచుండఁగా ముద్దుబిడ్డ లెందతో కనుపింతురు. వారియాటలు చూచినను, వారిమాటలు విన్నను ముచ్చటగానే యుండును. కాని వారి యందరకన్న మనగడుపునఁ గన్న బిడ్డలయం దంతతీపియు నంత మమకారమును నెట్లేర్పడును? చటుక్కున నొక్కమాటు వీథినిఁ బోవు చుండఁ గనుపించిన వారివైపు దృష్టిపోయినప్పటికిని తిరిగి తిరిగి పదేపదే, వారిని గలసికొని, సహవాసముఁ జేసి కొని యా సహవాసముమూలముగా శాశ్వతానందముఁ బొందుటకుఁ దగినవీలుండదు కావుననే ఊరక సుతోషింతుము. మనభార్యాపుత్రాదులవిషయ మట్టిది గాదు. ఏలనన, మనజీవిత ములును వారిజీవితములును భ్రమసూత్రముల చేఁ గట్టఁబడి యున్నవి. నిత్యమును జూచుచు సంభాషించుచుఁ గలసి మెలసి సౌఖ్య మనుభవించు చుండుటవలన మనయానందమునకుఁ జిర స్థాయి యేర్పడుచున్నది. అదియే చిరకాలము పాతుకొనియుం టచే శాశ్వతానంద మగుచున్నది. కారణాంతరములవల్ల వియోగ మేర్పడినప్పుడు వీధుల వెంటఁబోవు చున్నప్పుడుఁ గనిపిం చెడు సుందరులపైనను, బిల్లలపై నను మనసు లగ్నములౌదు. ఎంత సేపటికిని నాభార్య నాబిడ్డ లనియే మనసు పీకుచుండును. కాఁబట్టి శాశ్వతానందమునకు మానవునకు సహజమైన కామమును చిరానుభూతియుఁ గారణము లైయున్నవి. కోరికలన్నిటిలో నతీతానంద మిచ్చునది భగవంతునిలోఁ జేరవలె నను