పుట:2015.372978.Andhra-Kavithva.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము,

రసము దేని నాశ్రయించి కొనును ?

161


విధులు, గురువులయెడ నడచుకొనవలసిన విధులు, రాజునెడ నడచుకొనవలసిన విధులు, ఇరుగుపొరుగువారియెడ నడచుకొన వలసినవిధులు, సంఘమునెడ నడచుకొనవలసిన విధులు, వ్యాపొ రమువిషయమునను, అర్థసంపొదనమువిషయమునను నడచు కొనవలసినవిధులు, స్వదేశ క్షేమమువిషయమున నడచుకొనవల. సినవిధులును, సర్వమానవ జాతియెడ నడచుకొనవలసిన విధులు, సర్వభూత కోటియెడ నడచుకొన వలసినవిధులు, తుట్టతుదకు భగవంతునియెడ నడచుకొనవలసి నవిధులును . సనంతములు, ఈవిధుల నన్నిటిని నిర్ణయించి శాసించుశాస్త్రము లెన్నియే నియుఁ గలవు. సంఘశాస్త్రము, అర్థశాస్త్రము, ,శారీరశాస్త్రము, ధర్మశాస్త్రము, నీతిశాస్త్రము మొదలగుశాస్త్రము లెన్ని యేని. గలవు. ఈశాస్త్రములయొక్క మూలసూత్రము లన్నియు నొకే విధముగ నుండును. సర్వశాస్త్రములకు సమానములగు సూత్ర ముల మీరి వర్తించుశాస్త్రమునకుఁ బ్రమాణాధికార ముండదు. కావుననే శాస్త్రా దేశము సర్వవ్యాప్తిఁ గలిగి యుండవలె ననియుఁ, దోడిశాస్త్రములతో సంబంధమును గలిగియుండవలె ననియు శాస్త్రజ్ఞులు వలుకుట.

కామముయొక్క స్వభావము.

ఇఁకఁ గామ్యార్ధము లనఁగా నేమి? గోరికలు మాసవుఁడు జీవిత కాలమునఁ గోరుకొనుచుండు కోరికలే. రుచ్యా హారములు కౌవలెనని కోరుట, చక్కనిగుడ్డలు కావలెనని కోరుట, చక్కనినగలు, చక్కని పూవులు, తీయనిపండ్లు, కమ్మని పిండివంటలు, చక్కని పెండ్లాము, చక్క-పిల్లలు, సుఖమరణము కావలెనని కోరుటయు మొదలుగాఁగలయవి. కోరికలు లేని ఆంధ్ర కవిత్వll