పుట:2015.372978.Andhra-Kavithva.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

ఆంధ్ర కవిత్వచరిత్రము

తృతీయ

జీవిత సంరంభము యొక్క స్వభావము

కాఁబట్టి మానవజీవితము నొళవంకను కామ్యార్ధములు నడిపించును. వేదొకపంక శాస్త్రములు' విధిని షేధముల నిర్ల యించి మానవుని కామ్యార్థ ప్రవృత్తిని స్వచ్ఛంద ప్రవృత్తిని నడ్డగింపఁజూచును. కామ్యార్థ ప్రవృత్తి చే సూచితమగు మానవ స్వభావమునకును, శాస్త్రమునకును నిరంతర సంరంభమును, సంఘట్టనమును, జీవితమహాయుద్ధరంగమున జరుగుచునే యుండును. ఈసందర్భమునే పాశ్చాత్య శాస్త్రజ్ఞులు “Struggle for Existence" (జీవితసంరంభ) మని పేర్కొ నినారు. ఈ జీవితసంరం' భముయొక్క' స్వభావమును, అందు రసమునకుఁ గలసంబంధ' మును నిరూపించుటయే ప్రస్తుతకరణీయము. . ఈ జీవితసంరంభ' మున నెగ్గి కామ్యార్ధములకును, శాస్త్రా దేశములకును సామ రస్యమును నెలకొల్పి నిర్వర్తితకాలములును, సఫలీకృతమనో రథులును నై విజయులైనవారే సిద్ధపురుషులు. సామాన్య మానవు నీసంరంభమున కాలుసేతుల 'విరుగఁగొట్టుకొనియో, ప్రాణములఁ బోఁగొట్టుకొనియో నశించుచున్నారు.

ధర్మశాస్త్ర నిరీక్షణము; విధులయొక్క- స్వభావము.

మానవజీవితరథమునకు రెండుచక్రము లనఁదగు కామ్యార్ధములయొక్కయు, విధులయొక్కయు స్వభావమును, సంబంధమును జర్చించెదను, విధు లనఁగా మానవుఁడు పరుల యెడ నడచుకొనవలసిన రీతు లనియే యర్థము. విధులనంత ములు. తల్లి దండ్రులయెడ నడచుకొనవలసినవిధులు, దాంపత్య ధర్మమువిషయమున ' నడచుకొనవలసినవిధులు, బిడ్డలయెడ నడచుకొనవలసినవిధులు, స్నేహితులయెడ నడచుకొనవలసిన