పుట:2015.372978.Andhra-Kavithva.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

ఆంధ్ర కవిత్వచరిత్రము

ద్వితీయ


మజ్నూ నుని సామాన్యమానవునిగ లైల ఖావించి త న్నాతఁడు వరించునని నమ్మి యతని ననేకవిధములఁ బ్రార్థించెను. కాని పిట్టపిడుగువో లే మజ్నూ సొమెతో “నీవు లైలవే కావు పో ' మ్మనుచు లైలను జూడుమని చెట్టు చేమలు, పూవులు, పక్షులుమొదలగు వానినెల్లఁ జూపి తనదారిని దానుఁ బోయెను, మజ్నూను చెప్పిన వాక్యము లెంతయు గంభీరములుగ నున్న వి. లైల విశ్వమెల్లను దానయై వెలుఁగునఁట, నిజముగ నట్లు వెలిఁగి నను వెలుఁగకున్న ను మజ్నూనునకుఁ బ్రణయ తపస్సిద్దివలనఁ బ్రపంచమున నెల్ల యెడలను లైల యే వెలుఁగుచుఁ గనంబడెను. అందుచే నతనికి లైల కానవస్తువు లేనే లేకుండెను. స్థూల రూపము ధరించి యున్న లైల యామె స్వచ్చకాంతియొక్క ఖండమేమో, సంఛన్న శకలమేమో. అంతియోకానీ లైలయా మెయే యనిన నతఁడు నమ్మడు. ఆహా! మజ్నూను ప్రణయ భావ మెంత విశ్వవ్యాప్తి నొందెను. ఆహా! స్థాయీభావమున కుండఁదగిన విశ్వవ్యాప్తి మజ్నూనుని ప్రణయ వ్యాపారమున నెట్లు ప్రదర్శితమైనది?

ప్రప్రమథమున స్థూల వస్తువు నాశ్రయించుకొని మజ్నూ నుని రసభావము స్థూలవస్తుసంబంధమను శృంఖలల విదిలించు కొని స్వచ్ఛంద ప్రవృత్తం 'గాంచి విశ్వమెల్లను విహరించుచు విశ్వవ్యాప్తినొందెను. అట్లేకదా రసవిషయము? కవికిని ప్రకృతికినిఁ గలసంబంధ మట్టిదియేకదా! రసీకుఁడు జనాంతరసంస్కార బలముచే నిమిత్తమాత్రముగ నొకవస్తువు నాధారముగఁగొని తన్మూలమున రసానుభూతి నొందును. "కొని యతఁడు కొంత కాలమైన పిమ్మట రసానుభూతియొక్క బలిమిచే వస్తువుసంబంధమును గూడఁ ద్యజించి స్వతంత్రముగ రసానుభూతిఁ బడయఁ