పుట:2015.372978.Andhra-Kavithva.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

149

ప్రకరణము.

రసస్వరూపనిరూపణము.

పలుదిశల లైలా యంచుఁ బరుగులిడుచు
బోయె మజ్నూను ఆనందపురముఁ జేర,

స్థాయీభావముయొక్క విశ్వవ్యాపిత్వము.

లైలా మజ్నూ నునిఁ దన్నుఁ బరిగ్రహింపుమని కోరెను. కాని మజ్నూను సామాన్యవాంఛా ప్రపంచమును మీరిపోయినాఁడు. కామ్య వాంఛ లన్నియు విడనాడి లైలానామస్మరణ మున కాలముఁ గడపు చుండెను. అందుచే లైలాయొక్క ప్రేమమూర్తి యతనిమనగఫలకమునఁ దిరముగఁ జిత్రింపఁబడెను. లై లదక్క నన్యము ప్రపంచమున నతనికి గోచరింపకుం డెను. అతనితపము సిద్ధం చేను. ఏలైలపొందు నతఁడు యావనోనా దవళమునఁ గోరెనో యాలైల పొందే యిప్పుడు తపోబలిమిచే నతఁడు మానసికముగ ననుక్షణ మనుభవించుచుఁ దనినిఁ జెంది ప్రణయనిర్వాణానందమున నోలలాడుచుండెను. అందు చే బకృతిస్వరూపియగు లైలయొక్క బాహ్య స్వరూప మతని నాకర్షింపదయ్యెను. లైలయొక్క స్త్రీ సహజమగు ప్రణయ వేదన యతని మనస్సుఁ గరఁగింపఁజాలదయ్యెను. చివజుకు లైల యొక్క బాహ్యస్వరూపమునే యతఁడు గుఱుతింప లేకపోయెను. లైల స్త్రీ సహజములగు చంచలతయు, మృదుస్వభావ మును కలది. అందు చేత నే మజ్నూను వీడి యింకొకనినిఁ బెండ్లి యాడినదియు నతనిమఱువజాలక యాతనియందే బద్దాను రాగయై యుండెను. తత్కారణమున భర్త చనిపోయిన పిదప మజ్నూనుకడ కేతెంచి తిరిగి తన్నుఁ బరి గ్రహింపుమని యాతని వేఁడుకొనెను. తనవియోగముచే మజ్నూను నందుఁ గలిగిన మార్పును, అతఁడు వడసిన తపస్సిద్దియు నెఱుఁగదయ్యేను.