పుట:2015.372978.Andhra-Kavithva.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

143

ద్వితీయ

ఆంధ్ర కవిత్వచరిత్రము

వుఁడు గాఁడు. జగన్మోహనా కారుఁడు, వేణుగానము చే సకల చరాచర ప్రపంచమును గరఁగింపఁగలిగిన గాయకశిఖామణి, అమేయ ప్రతాపశాలి. శ్రీకృష్ణుని మహిమలఁ బొగడుటకు శక్తి చాలమిచే నింతటితో ముగించి ప్రకృతము ననుసరింతును. ఆట్టిమహాపురుషుఁడగు శ్రీకృష్ణునిసౌందర్యముఁ జూచియో, గానమునకు భ్రమనొంది యో, మహిమల చేఁ బారవశ్యముఁ జెంపియో, మఱి యేకతముననో రాధ వరించెను రాధ సామాన్యు రాలగు గొల్లపడుచు కాదు. రసహృదయము కలది. శ్రీ కృష్ణునిగుణములఁజూచి వ్యామోహిత యయ్యెను. కండ కొవ్వి దుర్వృత్తిలో దిగు సొమాన్యాభిసారికలుంబోలెఁ గాక రాధ రసహృదయ యగుటం జేసి గుణాభిరాముఁడగు శ్రీకృష్ణునిఁ జూచినతోడనే ప్రేమించినది. శ్రీకృష్ణునిగుణముల గ్రహించి, యాతని మహిమకు వ్యామోహముఁ జెంది రాధ వలపుఁ జెందెను. అట్టి రాధను సామాన్య వ్యభిచారిణులతోఁ బోల్పఁదగదు. ఆమెయెడ విశిష్ట ధర్మములు వర్తింపఁ జేయవలెను రాధ యొక్క స్వభావమును రసవృష్టితోడను దయాపూర్ణ హృదయము తోడను విమర్శించు విమర్శకున కాపి గుణము లద్దమునంబ లేక బరిస్ఫుటముగఁ గన్పడును సంకుచితస్వభావులకు రాధయొక్క చరితము నీతిబాహ్యముగఁ గన్పడుటలో నాళ్చర్యము లేదు.

గుణలుబ్దమై శ్రీకృష్ణునివరించిన రాధ యాతనియందు బద్దానురాగ యయ్యెను. ఏశుభముహూర్తమున శ్రీకృష్ణుని జూచినదోళాని యాముహూర్తమునుండియు రాధ యతని నుండి తనమనముఁ ద్రిప్పికొనఁ జూలదయ్యెను. నిముసముచిము సమును నాతని గొంచుట కామె కేక్కు డవకాశము కలి గెను. ఏలయన నిరువురు నొక కుటుంబములోనివారై యొక