పుట:2015.372978.Andhra-Kavithva.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము.

రసస్వరూప నిరూపణము.

143

యింటఁ బెరుగుచు నిరంతరము నొకరిసాన్నిధ్యమున నొకరు వర్తిలుచు నుండిరి. అందుచేత వారిప్రణయలత పెరిఁగి పెంపొంది యనూన సౌందర్యయుతములగు పల్లవములను, పుష్పములను దాల్చి, సౌరభము వెదఁజల్లఁగలిగెను. ప్రొద్దు ప్రొద్దుననె లేచిన తోడనె శ్రీకృష్ణునివదనదర్శనసౌభాగ్యమే, భోజనమువేళ శ్రీకృష్ణుని దర్శనమే, పాలుదీయువేళను పెరుఁగు చల్లఁజేయువేళను, పసుల దోలుకొనిపోయి మేఁపుచు నెండకుఁ దాళలేక చెట్టునీడ విశ్రమించెడివేళను, సాయంకాలమున వనాంతమునందుఁ గుసుమితసమయమున సైకతస్థలములఁ జంద్ర కిరణములవెలుఁగున రాసక్రీడఁ దేలువేళను, శ్రీకృష్ణునిదర్శనమెప్పుడును రాధకు లభించుచునేయుండెను అందుచేఁ బ్రథమమున నేక్షణముననో చూచి వరించినరాధకు శ్రీకృష్ణునిమూర్తి ప్రతిక్షణసన్నిహిత మైయుండి తీఱనిమానసోల్లాసముఁ గూర్చుచుండెను. అట్లు నిరంతరదర్శనపటిమచే రాధమనమందు శ్రీకృష్ణునిపైఁ బ్రేముడి యతీశయించి స్థాయీభావము నొందెను. అట్టిస్థాయీభావము కుదిరినకతన రాధకుఁ బ్రపంచమునెడ భయ రాహిత్యమును శ్రీకృష్ణునియెడ నద్వైతభావమును గలిగెను. పరులు కన్నఁ దప్పువెట్టెదరేమో యనుభీతి నశించెను. సర్వకాలసర్వావస్థలను శ్రీకృష్ణనామస్మరణముఁ గావింపుచు నాతనినే ప్రాణసమునిగను, ప్రాణములకన్న నెక్కువగుప్రియునిగను, నిష్టదైవముగను భావించి హృదయమును—సామాన్య శుష్కనీరసనారీహృదయము కాక ప్రణయార్ద్రీభూతమైన రసహృదయము—నాతని కర్పణముఁ గావించెను. శ్రీకృష్ణుఁడు దక్క నన్యము రాధకన్నులకుఁ గన్పడదయ్యెను. నీళ్లు ముంచుకొనుచుఁ జెఱువులోఁ గంఠములోఁతునీళ్లలో నిలువఁబడి