పుట:2015.372978.Andhra-Kavithva.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసస్వరూపనిరూపణము.

141


సమ్మత మైనది. సర్వశాస్త్రములును, సర్వమతములును, సర్వసిద్ధాంతములును నంగీకరించు ప్రణయ వ్యాపొరమే కాని విరుద్ద ధర్తములు కలది కాదు. గురుజనాజ్ఞానుసారముగ భార్యా . భర్తలై రామచంద్రుఁడును జూనకీ దేవియు ప్రణయ వ్యాపారములఁ జలిపిరి రాధామాధవులన్న నో అట్లు గావింప లేదు. రాధామాధవులు భార్యాభర్తలు కారు. శ్రీకృష్ణుఁడు సుక్షత్రియుఁడు. నిమిత్తమాత్రముగ యాదవవంశమున నందుని, యింటఁ దిరిఁగి యాదవుఁడుగ నెంచఁబడినవాఁడు. అట్టి సుక్షత్రియుఁడగు శ్రీకృష్ణుడు నందునికిఁ జెల్లెలివరుసయగు రాధను బ్రియురాలిఁగఁ జేపట్టుట యంత శాస్త్ర సమ్మతమయిన విషయము కాదని సామాన్యశాస్త్ర పరిజ్ఞానముకల వారికి సైతముఁ దెలి యును. అందులో రాధ వివాహితయగు నిల్లాలని సైతముఁ బ్రసిద్ధి. అట్టిచో శ్రీకృష్ణుఁడు పరుని భార్యయు,గొల్లయిల్లాలును నగు 'రాధతోఁ జెలిమి చేయుట సామాన్యముగ నీతిశాస్త్ర పరిచయులకు దోషముగఁ దోఁపకమానదు. శ్రీకృష్ణుని యేకపత్నీత్వమునకు, రాధయొక్క పాతివ్రత్యమునకునుఁ గూడ హానినీ, విరోధమును నాపొదించును. అంతీయ కాక సామాన్యమానవు లకు దుర్నీతిపై తము బోధించుననియుఁ గొందఱవాదము. ఏల నన: శ్రీకృష్ణునంతటి మహాత్ముడు గావించుటచే నిట్టినీతి విదూరకృత్యములు పవిత్రములనియే భావించి సామాన్యులును నీవిషయమున శ్రీకృష్ణు ననుకరించుచు దుర్నీ తీపరులై పర దారాపేక్షుకులై చరింతు రేమో యని వీరికి భయము,

     ఈనీతి సంగతి యెట్లున్నను రాధాకృష్ణుల ప్రణయవ్యా పారము సామాన్య విషయము కాదు. దానికి సామాన్యములగు శాస్త్ర నియమములు వర్తింపవు. శ్రీకృష్ణుఁడు సామాన్యమాన,