పుట:2015.372978.Andhra-Kavithva.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13


మానవునకును, సంఘముసకును గలసం బంధము - ఆర్యధర్మము. ఆత్త జీవితమునకును సాంఘిక జీవితమునకును సమన్వయముఁ గూర్ప యత్నించును - ఆర్యధర్మము ధర్మార్థ కామమోక్ష యుతము - జీవితసంరంభముయొక్క స్వభావము - ధర్మశాస్త్ర నిరీక్షణము, విధులయొక్క స్వభావము , కామముయొక్క స్వభావము - కోర్కులు వివిధములు - కామ్యార్ధములు భిన్న మగుచో నెట్లు? శాస్త్రావశ్యకత శాస్త్రము కామమును శాసింపం జూలదు - శాస్త్రము కవిత్వమును రసమును నిరోధింపఁజాలదు రసము అర్ధము నాశ్రయింపదు - రసము మానవసహజమగు, కామము నాశ్రయించును -కామము విశ్వవ్యాప్తి - ప్రకృతి కూడ భావసంచలనము నొందును - జగదీశ చంద్రవసువు గారి నూతన సిద్ధాంతము - వాల్మీకి రామాయణము నుండి యుదాహరణములు - పాఠ్చాత్యుల సిద్ధాంతము-1), వర్డ్సునర్తు, 9, బెన్నీ సక, ఉపసంహారము- కావ్యము యొక్క ప్రయోజన మాసంద జనకత్వమే - కావ్యమునకును శాస్త్రములకును బరమార్గమున విశేష భేదము లేదు - పాశ్చాత్యు లమతము, 1. ఆర్నాల్డు, 9, వర్డ్సువర్తు - పూర్వపుఋష్యాశ్రమములు రసభావప్రపూతములు.


చతుర్థప్రకరణము.

అనంతో వై రసః.

కామమునకును జీవసూత్రమునకును గలసంబంధము.పాశ్చాత్య మనశ్శాస్త్ర సిద్ధాంతములు, డార్విన్ పండితుని ప్రపంచ పరిణామ సిద్ధాంతము మానవుని సప్తావస్థలఁగూర్చి షేక్స్పియరు కవి యభి ప్రాయము - శ్రీశంకరాచార్యుల యభి ప్రాయము..