పుట:2015.372978.Andhra-Kavithva.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసస్వరూపనిరూపణము

121

చుట, పిచ్చి, మూర్ఛ, మరణము; అనియు నింకొకరినిర్వచన మునఁ జెప్పంబడి యె.

రెండు నిర్వచనములును నేకార ప్రతిపాదకము లేకాని, రెండవ నిర్వచనమున దృక్ అనుపదమున భౌతిక వస్త్వను భూతి స్ఫుటముగ వచింపఁబడినది. మొదటి నిర్వచనమున నభి లాషమచు పదమున ధ్వని మాత్రముగ నున్నది. ఈయవస్థల క్రమముఁ దప్పకుండఁ గాదంబరీ కర్తయగు భట్టబాణుఁడు వర్ణించినాఁడు. ఈ యవస్థలు క్రమముగ సంభవించునా? లేక పాత్రముయొక్క స్వభావమును శక్తిని ననుసరించి కొన్ని మాత్రమే యనుభవింపఁ బడునా? అనునది వివాదాంశము.

రసముయొక్క యవస్థల వర్ణించుటలోఁ గవి సర్వస్వతంత్రుఁడు.

గావ్యమున నెప్పుడును రసప్రవత్తియే ప్రధానలక్షణముగ గణింపఁదగినది. అట్టి రసప్రవృత్తి కవియొక్క.. చిత్తపరి పాఠమును, జిత్తవృత్తులనుననుసరించునే దాని యొక నియమము ప్రకారము వృద్ధినొంద నేరదు. అనఁగాఁ గవి తాను వర్ణింపఁ దలచుకొన్న విషయము రసోచితముగ నుండుటకుఁ బొత్రములకు నేయేయవస్థలఁ గల్పింపఁదగునో, యేయేయవస్థల ననుభ వింపఁ జేయఁదగదో స్వబుద్దిబలమున యోచించి వర్ణించును. ఎట్లనఁగా నుపాధ్యాయుఁడు విద్యార్థులకుఁ బాఠములు చెప్పు నప్పుడు విద్యార్థుల తెలివి తేఁటల ననుసరించి కొందర కొకొక్క గ్రంథమునందుఁ గొన్ని యధ్యాయములు మాత్ర మే చెప్పి మఱియొక్క పుస్తకమును భారంభించును. కొందఱకు వరుస దప్పకుండ గ్రంథమాదినుండి తుదివఱకు బోధించును. 'తెలివిగల