పుట:2015.372978.Andhra-Kavithva.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

ఆంధ్ర కవిత్వచరిత్రము

ద్వితీయ


విద్యార్థి గ్రంథమున నొకటి రెండ ధ్యాయములు సదుపఁగనే పొత్తములోని సారమును గ్రహించి మిగిలిన భాగములను దనంతటఁ దానే చదువుకొని యన్వయించుకొనఁగలఁడు. మందమతియగు విద్యార్థి గురువునకును, దనకును గంఠశోష జనించునట్లుగ నుపాధ్యాయునిచే గ్రంథము సర్వముం జెప్పించు కొనును. కొందఱుపిల్ల లేఁ డాదిలోపల మందమతులు నాల్గేండ్లు. సదువు చదువును ముగించి పై తరగతులకుం బోవ నర్హులై యుందురు. కొందఱు మందమతులు సంవత్సరమున కొకతరగతిచొప్పునఁ జదువుచు జీవిత కాలమున సగము చదువుతోనే గడపెదరు. కొంద ఱొకసారి చెప్పఁగనే గ్రహించు నేకసంధాగ్రాహులు. కొంద టెన్నిమారులు చెప్పినను బాఠము రాని, వారు గలరు. ఉపాధ్యాయుఁ డిట్టి వివిధాంశములుగల బాలుర బుద్ధిబలమును గ్రహించి యెవరి కనుకూలమగు రీతి వారికిఁ బాఠ ములు చెప్పి విద్యయం దుత్తీర్ణులఁ గావించు.

రసముయొక్క దళావస్థాశ్రమమునకుఁ బాత్రలు.యధికారము ననుసరించి ప్రసక్తి కలుగును. 

అట్లే పాత్రములు చూచుటతోడనే భావో ద్రేకము నొంది రసపారవశ్యము జెందుదురు. కొందఱు. చూచినతోడనే భావోద్రేకము నొందక యేదో యొకరీతిని, జీవితము నెగ్గించుచు వివిధావస్థల నొంది తుదకు రసస్పర్శ ననుభవించినవారుం 'గలరు. పూర్వకాలపు టమాయకులందు భావోద్రేకముగాని రసపారవశ్యముగాని యేమాత్రము నను భవింపక గతానుగతికములగు లోకమర్యాదల ననుసరించి జీవితముఁ గడపుచు నే యొడిదొడుకులును ననుభవింపక స్వ