పుట:2015.372978.Andhra-Kavithva.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

ఆంధ్ర కవిత్వచరిత్రము

ద్వితీయ


మెఱపు మెఱసినట్లు భాషమును జనింపం జేసి కవిని స్తంభితుని గావించి యేఁగును. ఈభావము మనలాక్షణికులకన్న పాశ్చాత్వలాక్షణికులు స్థూలముగను, నరవిందఘోషు సూక్ష్మముగను జర్చించినారు. రస ప్రవృత్తికి నకారణజనితస్వాదమే కారణమని మనవారు గ్రహించినట్లు స్పష్టముగఁ దోఁచుట లేదు. మన వా రెంతవఱకును నవస్థాదికమున భావము పరిపక్వము నొంది తుదకు స్థాయీ భావముగఁ బరిణమించునని తెలుపు చున్నారు మామతమున, రసము చిత్తపరిపాకము నను సరించి రససందర్శనానంతరమున జనించి పర్యాలోచన మనఁదగు విభావానుభావాది వివిధావస్థల యనుభూతి వలన స్థాయీత్వము నొందుననియే? రసమునకుఁ గారణ మాథ్యాత్మికముగాని, భౌతికము గాదు. ఎట్లనఁ: గవికిఁ జిత్త సంస్కారమే ప్రధానగుణ మగుటచే నదీ లేనివారికి రసాను భూతి యసంభవమగును. కనుక జన్మాంతరసంస్కారముఁ గల వాఁడయ్యు భౌతికవస్తువు నాధారముగఁగొని తనజన్మాంతర సంస్కారవాసన నావస్తువున కొసఁగి తద్భావనావిశేషమున స్వొదమును ననఁగా నపరిమితానందమును బొందినవాఁడగును. ఈమతముయొక్క సిద్ధాంతము ప్రకారము. వస్తువులలో నిసర్గముగ దుర్గుణము లుండవనియు, నట్టిదుర్గుణములకుఁ గార ణము కవియొక్క జన్మాంతర సంస్కారాభావత్వమే యనియు స్పష్టమగుచున్నది. ప్రకృతియందలి సర్వవస్తువులును స్వాదము నొసంగఁగలుగును గాని యట్టిస్వాదము సంస్కారికిమాత్రమే జనించును. అట్టిస్వాదము సంస్కారముగలిగిన కవికి నెట్టి వస్తువుషలననైనను గలుగును. స్వాదము హృదయానుభూతమే కాని వేఱుగాదు. అనుభవించువానికిఁ జిత్తసంస్కారమువలన