పుట:2015.372978.Andhra-Kavithva.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసస్వరూపనిరూపణము.

117


జన్మాంతరలబ్ధచిత్తపరిపాకము ననుసరించి కవికి లభ్యము గావలయునేకాని యూరక సాక్షాత్కారబలము లేక దివ్యదృష్టి లేక గ్రంథపఠనమును నలంకారశాస్త్రపఠనమును గావించినంత మాత్రమున రాదు. స్వాదమనునది. హృదయసంబంధవిశేషమే కాని యూహవిశేషము గాదు. స్వాద మెప్పుడును ననుభవ నీయమేకాని నిర్వచనీయమును సిద్ధాంతీకరింపఁదగినదియును గాదు. స్వాదమునకును వివిధాంశములును, వివిధాంతరములును గలవు. కాని, నిసర్గముగ స్వాద మకారణజనితము. జన్మాంతరసంచిత చిత్తసంస్కారముచేఁ బరిపక్వమయిన కవి హృదయము వస్తువులసందర్శించినప్పుడు స్వాదము జనించును. అట్లు జనించిన స్వాదమే వివిధావస్థల నొంది స్థాయీభావ రూపమున సిద్ధినొందు ననియే మామతము.

రసమునకు జన్మ కారణములు,౧. రసికుని చిత్తపరిపాకము ౨.వస్తుసందర్శనము.

రసస్వరూపనిర్ణయముఁ గావించుటయందు రసము యొక్క జన్మప్రకారమును, వృద్ధియు, సిద్ధియుఁ,జర్చనీయములు. జన్మప్రకారము అనఁగా _జన్మకారణము_రసికునియొక్క జన్మాంతరలబ్ధచిత్తపరిపాకమే. అనఁగాఁ గవియొక్క జన్మాంతర లబ్ధచిత్తపరిపాకమువలన వస్తుదర్శనానంతర ముద్భవించు స్వాదమే యగును. రసము వస్తుదర్శనానంతర ముద్భవింపవలసినదే కాని శూన్యత నాశ్రయింపదని మున్నే యెఱింగించియుంటి. ప్రపంచమునందలి వివిధరసప్రవృత్తులకెల్ల వస్తుసందర్శనమే ప్రధానాశ్రయము. అట్టి వస్తుసందర్శనము జన్మాంతరలబ్ధచిత్తపరిపాకము గలిగిన కవిమనమున స్వాద ముదయింపఁజేసి