పుట:2015.372978.Andhra-Kavithva.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసస్వరూపనిరూపణము,

119


నేవస్తువునందు మనంబు లగ్నంబగునో యావస్తువే స్వాదమునకు బాహ్యాశ్రయ మగును. అనఁగాఁ బైకి నావస్తువే స్వాదము జనింపఁ జేయునట్లు దోఁచును. నిజమరసిసఁ గవి యొక్క సంస్కార వాసనయే వస్తువునకు స్వాదజనకత్వము నాపాదించును. ఎట్లనఁ: బూవుయొక్క పరిమళము చేఁ జుట్టునున్న ప్ర దేశమంతయు సువాసిత మగునటుల; ఈభావమే 'తాను మునిఁగినది గంగ తా వలచినది రంభ; తన చావు జగము గ్రుంగుట' యనులోకోక్తుల వ్యక్త్యమగుచున్నది. ఈభావ మునే విక్టర్ హ్యూగో యను ఫ్రెంచి కవీశ్వరుఁ డీ క్రింది వాక్యమున వివరించెను.

["There is no forbidden fruit is the beautiful garden of Poesy." (Victor Hugo.)]

(సుందరశరకవిత్వోద్యానమున వర్షనీయమగు ఫల మొక్కటియు లేదనియు సర్వఫలములును రుచికరమలును నవశ్యగ్రహణీయములును: ) అని పై మాటల యర్థము. ప్రతి వస్తువును నిసర్గముగ నేదోయొక గుణవిశేషమును గలిగియుండును, అట్టిగుణవి శేషము నాస్వాదించి వ్యక్తముఁ జేయువాఁడే కవియగును. అట్టికవి దనశక్తిచే నెట్టివ స్తువునయినను రసదృష్టితో నవలోకించి తత్ఫలితముగ రసాస్వాదమును ననుభవించు ననియే పై వాక్వము యొక్క భావము. కావున నింతపఱకుఁ దేల్చిన దేమనఁగా రసమునకు జన కారణము రసికుని) జనాంతర సంస్కారమువల్లను, వస్తుదర్శనమువల్లను, ఫలితముగ జనించు స్వాదమే యని. వాని యొక్క సంసర్గమువలన హఠాత్సంభవ మగు నలౌకికానందమే స్వాదమగు. ఆట్టిస్వాదమే రసజన్మ కారణ మగును.