పుట:2015.372978.Andhra-Kavithva.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

ఆంధ్ర కవిత్వచరిత్రము

ద్వితీయ

వ్యభిచారిభావములు ప్రదర్శింపంబడును. అనేకవస్తువులు వర్ణిం పఁబడును. అట్లు వర్ణింపంబడినవ స్తువుల యందుఁ గవియొక్క మనస్సు లగ్నమయినప్పు డనఁగాఁ గవి 'నేను, సమభావమును వీడి వర్ణించు వస్తువునం దే లక్ష్యముంచి యహమును వీడి వస్తువు. సందు లీనమయి పోవునపుడు తత్ ఫలితముగఁ గవికి , ప్రబలతరానందము జనించి తీరును. అట్టియానందమునే మనలాక్షిణికులు స్వాదమని నిర్వచించిరి. స్వాదమనఁగా స్థూలముగఁ జెప్పిన రసపారవశ్యమే!

స్వాదము యొక్క జన్మ ప్రకారము,

ఇంతవఱకు మనలాక్షణికులు చెప్పినది సరిగ నున్నది. కాని, వివాదమున కవకాశ మీక్రింది విషయమునఁ గలుగు చున్నది. అదెద్దియన?

ఈస్వాదము పృపథమమునఁ గవి వస్తువును సందర్శించుట తోడనే కలుగునా? లేక విభావానుభావాదికముగల వర్ణనానంతరమునఁ దత్ ఫలితముగఁ జనించునా! ఈ ప్రశ్నము యొక్క భావము విప్ప చెప్పిన నిట్లుండును. కవి రసపారవశ్య మును ననఁగా స్వాదము ననుభవించి "కావ్యరచనకుఁ గడఁ గునా? లేక యూరక కావ్యాలాపముఁ గావించి 'తీయఁగా తీయఁగా రాగమును, మూలుగంగా మూలుగంగా రోగమును' నన్నట్లు దుదకు స్వాదమును ననుభవించునా ? అనియే. ఈ ప్రశ్నకు సమాధానము రసజన్మ ప్రకారమును సూచించు సంద ర్భమున నిరూపించియుంటిమి. కవి సాక్షౌద్ద్రష్ట, అట్టిసాల్ట్ అట్టి సాక్షాత్కారమును దివ్యదృష్టియును లేనికవి యుత్తమకావ్యముల రచింప నేరఁడు: కావ్యనిర్మాణశక్తి యనఁగా రసాస్వాదనశక్తి