పుట:2015.372978.Andhra-Kavithva.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము,

రసస్వరూపనిరూపణము.

115


చేతను విచ్ఛిత్తినొందక, యచలమై చిరస్థాయియై, సర్వభావములను నాత్మ రూపమును దాల్చునట్లుగఁ జేసి వాని యన్నిం టికిని స్వకీయ వాసన నొసఁగుననుటయే. ఇట్టి స్థాయీభావమే రసమగునని మనలాక్షణికులు నిర్వచించి దానికే ' ప్రధాన అంగి ' యనునామాంతరముల నొసంగియున్నారు. రసముయొక్క యాశ్రయమును గూర్చియు, వానియొక్క యనంతవైవిధ్య మునుగూర్చియు, వేఱొకచో ముచ్చటింతము. ముందు రస స్వరూపము మనలాక్షణికులు నిర్వచించినప్రకారము తెలియం జెప్పెదను. రసము లన్నింటిలో మనవారు శృంగారరసమునే యెక్కువ విపులముగఁ జర్చించి యున్నారు.

రసముయొక్క బాహ్యస్వరూపము. "స్వాద " నిర్వచనము.

మన లాక్షణికులు రసముయొక్క బాహ్యస్వరూపమును నిరూపించు సందర్భమున, "స్వాదః కావ్యాఘసం భేదాదా త్మానందసముద్భవః " ఆను సూత్రమును గావించినారు. వీనికి "కావ్యార్దేన విభావాది సంసృష్టిస్తాయ్యాత్మ కేన భావక చేతసః సంఖేదే ప్రత్య స్తమిత స్స్వపరవిభాగే సతి ప్రబలతర స్వానందోద్భూతి స్స్వాదః" అను వ్యాఖ్యానము గావింపఁబడినది. ఈసూత్ర వ్యాఖ్యానముల రెండింటివలన వ్య క్తమయినభావము లేవన:--- స్థాయీభావమునకు విభావాదికమును గలిగిన కావ్యమునందు వర్ణితములయిన వస్తువులతో మనసు పూర్ణముగ స్వపర భేదము లేకుండ లగ్నమగుట వలన జనించు ప్రబలతరస్వానం దానుభూతియే స్వాదము, కావ్యమునందు స్థాయి సంహారీ