పుట:2015.372978.Andhra-Kavithva.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసస్వరూపనిరూపణము.

105

విభావై రనుభావైళ్ళ సాత్త్వికై ర్వ్య భిచారిభిః, ఆనీయమానస్స్వాద్యత్వం స్థాయీభావో రసః స్మృతః." యనుచు విభావాదికముల నిమిత్తమాత్ర ప్రయోజనమును “ఆనీయమాన” అనుపదముచే సూచించియే యున్నారు.

.విభావాదుల విషయమున గమనింపవలసిన విషయములు


కానీ విభావాదుల ప్రసంగవిషయమున ముఖ్యముగ గమ నింప వలసిన విషయములు రెండు. రసము రసికునిచిత్తసంస్కా రము నాధారముగఁ గొనుననుట యొక్కటియుఁ, బ్రకృతిలో సంపూర్ణ సామ్యముండక భిన్న త్వాంతర్గర్బితమగు నేకత్వమే వర్తించుననుట యొకటియు, నీ రెండు విషయముల గ్రహించితిమేని యనంతవిధములఁ బ్రసరించు కవిచి త్తసంస్కారము, రస స్పర్శ ననుభవించి, యసంఖ్యాకములును, ననంత పై విధ్యము కలవియును నగు విభావాదుల నొందుననియు, లాక్షణికులు సూచించెడి విభావాదుల పట్టిక యుదాహరణమాత్ర మేయనియుఁ గవిని బంధింపఁగలుగు శాసనము కాఁజలదనియు, కవి శ్రావ్య సృష్టిపట్లఁబోలె విభావాది కావలంబనముపట్లను నిరంకుశుఁడై ప్రవర్తించి నిజమనోభీప్సిత సిద్ది యనఁదగు రససిద్దిని స్థాయీ భావము రూపమునఁ బడసి ప్రకటింపఁగలఁ డనియుఁ దేటపడం గలదు, కవికిఁ బ్ర ధానలక్యుము లక్షణానుకరణముగాక రస సిద్ధిని స్థాయీభావమును నొందుటయే యగును.

స్థాయీభావత త్త్వము.

రససిద్దియు, రసనిర్వాణమును, రసముముక్షతయు ననఁ దగు నీస్థాయీభావప్రశంస కొంచెమువిపులముగఁ గావింతము .