పుట:2015.372978.Andhra-Kavithva.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

ఆంధ్ర కవిత్వచరిత్రము

ద్వితీయ

మున గోచరమైన రసస్వరూపము స్థాయీభావము నందునని యిదివరకే సూచించి యుంటిమి. విభావానుభావాదు లీమనన కార్యమునకుఁ దోడ్పడును. రససిద్ధికి నేంతేనిఁ దోడ్పడును. తుదకు స్థాయీభావరూపమున రససిద్ది యైనతోడనే "లోకంబులు, లోకేశులు, లోకస్థులుఁ దెగి "యలోకంబగు పెంజీకటి కవ్వల నేకాకృతి వెలుఁగు” పరమాత్మలో నై క్య మౌకరణి నీవిభావానుభావాదులు స్థాయీభావమున నై క్య మొందును. కావున రసము జనించునప్పుడును సిద్దించు నప్పుడును నేకత్వము నే పొందియుండును. జన్మకును సిద్దికిని నడుమ విభా'వానుభావ సాత్వికవ్యభిచారీభావములు రసముయొక్క నిమిత్తమాత్రమగు బాహ్య స్వరూపమును బ్రకటించును.

విభావాదులు రసమునకుఁ బ్రస్తార భేదములఁ గల్పించును.

అంతియ కాక నీవిభావాదికములు కావ్యమునకు వై విధ్య గుణము నాపొదించునని తెల్పియుంటిని. ఏకస్థాయిని కావ్యమున రసము ప్రదర్శన యోగ్యము కాకుంట చే నే దేని మార్గమున నా రసమునకు ప్రస్తార భేదములఁ గల్పించఁదగును. అట్టి ప్రస్తార భేదములన్నియుఁ గావ్యాత్మ యగు రసమునకుఁ గట్టువడియుండి దానిని సూచించుచుఁ గావ్యమునకు వైవిధ్యము నొడఁ గూర్చును. కావున నీవిభావాదులు కావ్యాత్తయగు రసమును బోషించిదోహదముఁ గావించును. సాక్షాత్కారలబ్దమైనరసము విభావానుభావాదుల సాధనములుగఁ గొని తిరిగి స్థాయీభావ రూపమున స్వస్వరూపసిద్ధిం బడయును గావుననే మనవారు