పుట:2015.372978.Andhra-Kavithva.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసస్వరూపనిరూపణము.

103


తగర్భితమగు నేకత్వమే సృష్టిలక్షణమని తిరిగి హెచ్చరించు చున్నాఁడను.

కావ్యసృష్టి విషయమునఁ గూడ నీభిన్నత్వాంతర్గర్బిత మగు నేకత్వము వర్తించును. ఎట్లన కావ్యసృష్టికి మూలకార ణము జన్మాంతరసంస్కారవాసనాబలమే. ఆయ్యది యాత్మశక్తి యేకాని వేరుకాదు. అట్టియాత్మశక్తిని గవి సాత్కార బలమునఁ బొంది యనుభవింపఁ గలుగును. సాక్షాత్కారమగు నప్పుడు కావ్యాత్మయగు రసము మెఱుపువోలె క్షణదృశ్యమై మాయమగును. భిన్న భిన్న రూపములతోఁ గవికిఁ గనుపింపక నేక తేజముతో హఠాత్తుగా నయ్వది గోచరించును. సాక్షాత్కారమున దృశ్యమైన తేజమును మననముఁ గొవించుటలోనే భిన్నత్వము, ద్వైత భావమును, సృష్టి వైవిధ్యమును జనించుట కవకాశము కలుగుచున్నది. అట్టిమనస బలమున స్థాయీభావము చేకుతీ రససిద్ధి యైనతోడనే వైవిధ్యమునకు, భిన్నత్వమున కును నవకాశమును, బ్రసక్తియుఁ దగ్గిపోవును. అప్పుడు స్థాయీ భావరూపమునఁ దిరిగి యేకత్వమే సిద్దించును. అప్పుడే కవి సిద్ధుఁడగును.

విభావాదులు రసముసకు స్వరూపముఁ గల్పించును.

కావున విభా-వానుభావ-సాత్వక-వ్యభిచారీ భావములు సాక్షాత్కారబలమున జనించిన రసము యొక్క బాహ్య ప్రవృత్తిని దెలుపఁగలుగును. కేవల తేజోరూపమున గోచరమైన రసమున కొక యవయవయుతమగు స్వరూపమును గల్పింపఁజూచును. ఈస్వరూపము ప్రయోజనార్థియును సాధన మాత్రమునని యెంచనగును. నిరంతర మననబలమున మొదట తేజోరూప