పుట:2015.372978.Andhra-Kavithva.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

ఆంధ్ర కవిత్వచరిత్రము

ద్వితీయ

ఆసనాదిసాధన సంపత్తిబలమున యోగి తుదకు యోగ సిద్ధి నంది పరమేశ్వరుని తేజమును నిత్యము నెట్లు సందర్శించి యానందానుభూతి నందు చుండునో యట్లే కవియు విభావానుభావాది సాధనముల బలమున స్థాయీభావము నంది రససిద్ధిఁ బొందినవాఁ డగును. భక్తుఁ డెట్లు' ధ్యాన - మనన-భజన-అర్చనాది సాధన ములద్వారా మనోనైల్యము వీడి నిర్వాణమునొందునో యట్లే కవియు విభావాది సాధనములద్వారా స్థాయీ భావరూపమగు రసనిర్వాణమును జెందినవాఁడగును. జపతప - స్వాధ్యాయ నిరతుఁ డై తపసి యెట్లు దేహేంద్రియ ప్రపంచము మరచి. జీవన్ముక్తుఁడై ముముక్షుత్వము నొంది పరమాత్మతో నైక్య మగునో యట్లే విభావానుభావాదికముల ప్రస్తారము వలనను మననము వలనను రసము వైవిధ్యమును, ద్వైత భావమును, వీడి యేకత్వము నొంది స్థాయీ భావరూపమున సీర్ధినొందిన దగును. కావున రససిద్ధిని సూచించు నీస్థాయీ భావ ప్రశంసయే రసస్వరూప చర్చకు మిక్కిలి యవసరము. స్థాయీభాపతత్త్వము బాగుగ గ్రహించిన వారికి రసస్వరూము గోచరించును. స్థాయీభావమే రసముగ మనలాక్షణికు లన్వయించి వ్యవహ రించుటకుఁ గల రహస్య శారణ మిది యేయని గ్రహింపఁదగును.

స్థాయీభావ మనఁగ నేమి ?

స్థాయీభావమన స్థూలముగఁ జెప్పినచో స్థాయి నొందిన భావమనియే. స్థాయి యనఁగ నిలుకడ యని యర్థము. తిరముగ పాతుకొని యుండు భావమే స్థాయీభావ మగును. మానవుని కనేక భావములు జనించినను నేదే నొక్క భావమే ప్రాధాన్యము వహించి మిగిలిన వానిని నడపుచు మనమునఁ జిరస్థాయి నంది.