పుట:2015.372978.Andhra-Kavithva.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసస్వరూపనిరూపణము,

101

నిశ్చితము. కాని, వివిధమానవుల ప్రాణముల కుండు శక్తు లును, వివిధమానవుల పంచేంద్రియ వ్యాపార ప్రవృత్తియు భేదించును. ఒక్కొకనిప్రాణ మతిశక్తిఁ గలదియై యెట్టి కష్టములనైన నోర్వంగలదియై యుండును. కొందర ప్రాణీ యతి సుకుమారమై కష్టముల కోర్వక ముట్టుకోనిన వాడిపోవు పూవుంబోలె వర్తిల్లును. ప్రాణికిఁ గలశక్తియం దుండు తారతమ్యము సూచించితిమి. ఇఁకఁ బం చేంద్రియ వ్యాపార ప్రవృత్తియందును గూడ ననంతములగు విభేదములు గానవచ్చుచుండును. రుచుల విషయమునఁగల యనంతవి భేదము 'లోకో భిన్న రుచి:' యను జన ప్రశస్తిఁగన్నది. వాసనా విషయనఁ గూడఁ గొందఱకు గాటు నగువాసన యింపుగనుండును. కొందఱకుఁ దేలికయగు వాసన యింపుగ నుండును. శబ్దము, స్పర్శము, మొదలగు నిత ధేంద్రియ వ్యాపార ప్రవృత్తి యందుఁ గూడ నిట్టి యనంత వైవిధ్యమును సోదాహరణముగఁ బ్రదర్శింప వచ్చును. కానీ గ్రంథ విస్తరభీతి చే ‘స్థాలీపులాకన్యాయ' మునే యనుసరింపవలసిన వాఁడ నయితి. ప్రకృతి యెప్పుడును, నీ క్రింది సూత్రము ప్రకారము ప్రవర్తించును. వివిధ వస్తువులకు జీవగుణముల యందు నైక్యభావమును సామ్యమును, ప్రధానగుణముల యందు వైపరీత్యమును వైవిధ్యమును వర్తించుచుండును. భిన్నత్వము లేనిది యేకత్వము సంభవించుట యరుదు. భిన్నత్వముతోఁ గూడిన యేకత్వమే ప్రకృతియొక్క లక్షణము, ప్రకృతి సృష్టికర్త మనమునందు భావరూపముగ నుండినపు డేకత్వమునే కలిగి యుండును. దీనినే మనవారు పరమాత్మ యొక్క నిర్గుణత్వముగను నేకత్వముగను నిరూపించిరి. సృష్టికర్తృ వదన గహ్వరాంతరములనుండి గుణరూపమున వెలువడిన సృష్టి యనంతమగు