పుట:2015.372978.Andhra-Kavithva.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర కవిత్వచరిత్రము

ద్వితీయ

102

గుణ లక్షణ - స్వరూప విభేదములచే ననంత వైవిధ్యములతో నొప్పుచు నర్తిల్లు చుండును. చివరకు సృష్టియంతయు నశించు సపుడీయనంత వైవిధ్యమంతయు రూపఱిపోవును. ఈభావమునే పోతనామాత్యుడు గజేంద్రమోక్షణము........

  శ. లోకంబులు లో కేసులు లోకస్థులుఁ
దెగినతుది నలోకంబగు పెం
జిఁకటి కవ్వల నెవ్వం
డే కాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.

అను పద్యమున సూచించెను. సృష్టి యంతయు లయమయిన పిమ్మట ననఁగా ననంతగుణరూపవి భేదములతో నొప్పు 'లోకంబులు లోకస్థులుఁ దెగినం' దుది నలోకంబగు 'పెంజీకటి కవ్వల నేకాకృతితో భగవంతుఁడు వెలుఁగుననుచున్నారు. వైవిధ్య మంతయు నశించి యేకత్వమున లీనమగును. కావున భిన్నత్వము సృష్టియం దేకాని భగవంతుని యందు లేదు. ఏకత్వము నుండి జనించిన సృష్టి నిమిత్తమాత్ర జీవితముఁ గడపి తుదకు నేకత్వముననే లీనమై పోవును.

భిన్న త్వాంతర్గర్బితమగు నేకత్వము రసముపట్లగూడ వర్తించును.

ఈసృష్టి రహస్య మే రసమునకుఁగూడ వర్తించును. సృష్టి స్థితిలయములు సకలచరాచర ప్రపంచములకు సమానమే. సృష్టికి బూర్వమును, లయమునకుఁ దరువాతను నేకత్వమేకాని భిన్నత్వము లేదు. సృష్టి జరిగి, యది స్థితినొందుచు లయమగువరకు భిన్న త్వసూచిత గుణవై విధ్యము వర్తించును. కావున భిన్న త్వాం