పుట:2015.372978.Andhra-Kavithva.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

ఆంధ్ర కవిత్వచరిత్రము

ద్వితీయ

ననుకూల ప్ర దేశములఁ జరించి యనుకూలమార్గములఁ బురో గమనముఁ గావించి యిష్టాభరణములఁ దాల్చి యానందపార వళ్యమున స్థాయీభావము నొందుటకుఁ దగిన యవకాశము నీవిభావాదికములే గలిగించును. కావున విభావాదికముల ప్రయోజనము రససిద్దికిఁ దోడ్పడుటయు, రసమునకును,గావ్య మునకును పై విధ్యము నాపాదించుటయును నను ద్వివిధములుగ వర్తిల్లును.

భిన్న త్వాంతర్గర్భితమగు నేకత్వమే సృష్టి లక్షణము.

కాని, విభావాదిక ప్రశంసలో మనము గమనించవలసిన విషయ మొకటి కలదు. సృష్టి యనంతమనియుఁ బ్రకృతుల భిన్నత్వ మనంతమనియు ముందుగ మనము గ్రహింపవల యును. సాధారణముగ సంపూర్ణముగ నొకదానిని బోలిన వస్తు వింకొకటి యుండదు. ప్రతివస్తువునకును మూలమును జీవమును నగులక్షణ మేదో యొక టుండును. అప్రధానములగు గుణములు కొన్నియు నుండును. ప్రధానగుణవిషయమున నేకజాతి కిఁ జేరిన వస్తువులకు సౌమ్యముండును. కాని యప్రధాన గుణముల విషయమున నట్టిసంపూర్ణ సామ్య ముండుట యరుదు. ఎట్లంటి మేని, మానవులందఱకును బ్రాణమును, మను ష్యత్వమును ముఖ్య లక్షణములే. ఇచట మనుష్యత్వమను గాఁ బంచేంద్రియ వ్యాపారవశత్వమని యన్వయించుకొనఁ దగును. ప్రతిమనుజునకును బ్రాణ ముండును. ప్రతిమనుజుఁడును పంచేంద్రియ వ్యాపారములకుంగట్టువడియే యుండును. ఈ రెండు విషయములను, సర్వమానవకోటికిని బంచేంద్రియ వ్యాపారముల జయించిన సిద్ధయోగులకుందక్క సామ్యము