పుట:2015.372978.Andhra-Kavithva.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము

రసస్వరూపనిరూపణము,

99

రసము విభావానుభావాదికముల వలనఁ గార్యముల నిర్వర్తించు కొనుచు నిజ స్వరూపమును బ్రకటించుటకు వానిని సాధన ములుగ నుపయోగించుచుఁ దుదకు స్వస్వరూపసంధాన మనం దగు స్థాయీభావము నొంది సిద్దిగాంచినతోడనే విభావాదిక ప్రసక్తిని మఱచి స్థాయీభావజనీతో న్మాదమున నేయోలలాడు చుండును. ప్రాణి యుపాధిని దాల్చి ప్రవర్తించునంత కాలము నవయవము లెట్లు ప్రయోజనముఁ గల్గి యవసరములై యుం డునో యట్లే రసము కావ్యస్వరూపముఁ దాల్చి ప్రవర్తించు నంత కాలము విభావాధికమునఁ బ్రయోజనమును నవసరమును విదితము లగుచుండును. ప్రాణి యుపాధిని విడిచి పోవునపు డవయవముల యవసరము తీఱిపోవునట్లే రసము కావ్యస్వరూప మును వీడి సిద్దినొందు సమయమునకు నిభావాను భావాదికముల యవసరము తగ్గిపోవును. ఇందులకుఁ దార్కాణము కావ్యమున రస మేని యన విభావాకముల సుగతిఁ జెప్పక కావ్య జీవమగు స్థాయీభావమును గూర్చియే నిరూపణ గావించుటయే. స్థాయీభావము కావ్యమున రసమునకు జీవస్థానము వంటిదనీ చెప్పఁదగును. కావ్యమున రసము స్థాయీభావ రూపమున నే సిద్ధించి తన్మూలముననే నిరూపితమగును.

విభావాదుల ప్రయోజనములు. 1.రససిద్దికి ) - దోడ్పడుట. 2. రసమునకును గాన్యమునకును వైవిధ్యము నాపాదించుట.

విభావాదికము నిమిత్తమాత్రమును, సాధనమాత్రమును. వానియొక్క ప్రయోజనము స్థాయీభావమునకు మార్గముఁ జూపించుటయే, రసము అడ్డంకులు లేక యథోచితముగ