పుట:2015.372978.Andhra-Kavithva.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

ఆంధ్ర కవిత్వచరిత్రము

ద్వితీయ

విభావావికములు లక్షణ గ్రంథముల నుదాహరణ పూర్వకముగ వివరింపంబడియుంట నిశ్చయము. విభావాదులు రసమునకు వై విధ్యము నొడఁగూర్చును... రసము సాక్షాత్కారబలమున ననిర్వచనీయభావాను భూతిని జననమొంది. విభావాదిసాధనముల పరామర్శ చేయ బెంపొంది స్థాయీభావముగ సిద్ధించి కవికి యశమును, గావ్య మునకు స్థిరత్వమును సంపాదించును. కావ్యము శబ్దరూప మగుట చేతను శబ్ద మెప్పుడును నేకస్థాయి నుండక స్థాయీ భేదముల నొందుచునే యుండవలయుఁ గావునను గావ్యమున వైవిధ్యము తప్పనిసరిగ నుండవలయు. "కావ్యమునకు జీవాత్మ సాక్షా త్కారజనితరసమే. కాని, సాక్షాత్కారలబ్దమగు రసము చిత్ర ములను శిల్పములనుబలె నేకస్థాయిని గావ్యమునఁ బ్రదర్శిత మగుటకు వీలు లేదు. కావునం గావ్యమునకు వైవిధ్యగుణా లంకారము నొడఁగూర్చుటకు రసముయొక్క వివిధ ప్రస్తారము లను బాహ్యచిహ్నములును ననఁదగు విభోవానుభావసాత్త్విక వ్యభిచారి భావములకుఁ 'గావ్యమున నవసర ప్రసక్తి గలదు.

విభావాదులు సాధనమాత్రములు,

ప్రాణికి జీవమును నాత్మయును నదృశ్యములయినను నవ యవములు మాత్రము బాహ్యదృష్టికి గోచరించుచు నేయుండును, ప్రాణి యవయవముల సాధనమున నవసరకర్మముల నిర్వర్తించును. ప్రాణ మంతరించి పోవునపుడు సాధనమాత్రములును, బాహ్యచిహ్నములును నగు నవయవములుగూడ నంతరించి యాత్మ యొక్క యదృశ్యత్వమును నై క్యమును, నిరాకారతయు మాత్రమే మిగులును. అట్లే కావ్యమున జీవాత్మ యగు