పుట:2015.372978.Andhra-Kavithva.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర కవిత్వచరిత్రము

ద్వితీయ

84

________________


నేరఁడు, విత్తు లేనిది. చెట్టుండ నేరదు. చెట్టు లేని విత్తు లేదు. అను తర్కముంబోలె నిదియును నన్యోన్యాశ్రయత్వదోష మునకుం భాలగుచున్నది. కానీ, యన్యోన్యాశ్రయత్వ, దోష మనిరుద్ద్యము. అయ్యవి సృష్టి రహస్య వేదులకు నిశ్చయముగ దోషమునట్ల తోఁపఁదగదు. పాశ్చాత్య వేదాంతమున ముఖ్యముగను, మన వేదాంతమున నాచరణ విషయమునను (సిద్దాంతవిషయమునం గాక పోయినను), నన్వో, న్యాశ్రయము గుణముగనే పరిగణింపఁబడుచున్నది గాని దోషముగఁ బరిగణింపఁబడుట లేదు. ప్రపంచమున మూల సూత్రములన్నియు నొకదానినొకటి యాశ్రయించి యుండునే కాని పరిపూర్ణ స్వతంత్రములుగను నసంగతములుగసు నుండవు.

రస నిర్వచనము ౧, లాక్షణికమతము.

రసికునకును రసమునకును గలయన్యోన్యాశ్రయసంబంధ మును విమర్శించుటలో రసమననేమో యించుక సూచించియే యుంటిమి. ప్రకృతము రసమన నేమో సవిస్తారముగఁ జర్చిం తము. రసమనఁగ 'రస్యంత ఇతి రసా!' అనువ్యుత్పత్తి ననుస రించి యాస్వాదింపఁబడునది యని మనపూర్వలాక్షణికు లస్వయించి యీ క్రింది విధమున దానిని నిర్వచింపఁ బ్రయ త్నించిరి.

    శ్లో. విభావై రనుభావైశ్చ సాత్త్వికై ర్వ్యభిచారిఖిః,
ఆనీయమానస్స్వాద్యత్వం స్థాయీభావో రసస్స్మృతః.

విభాన అనుభాష సాత్విక వ్యభిచారిభావములచేఁ దేఁబడిన మాధుర్యముగలిగిన స్థాయీభావమే రసమని చెప్పంబడినది. వేదొకచోట స్థాయీభావమే రసమని తెల్పుచు 'రసః, సవవ