పుట:2015.372978.Andhra-Kavithva.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము,

రసస్వరూపనిరూపణము

83


బత్యేక ప్రయోజన సిద్దిరోజుకు నియోగింపఁబడినవాఁడు. ప్రకృతియం దంతర్గర్భితమైన రసవి శేషణమును బరమాత్రచే నియోజితుఁడగుకవి మొట్టమొదట గని పెట్టి వ్యక్తముఁగావించును. కావునఁ గవి నిమిత్తమాత్రుఁడే రసము చిరస్థాయియే. రస మేనాఁటి కేనియు ననుభవింప బడవలసిన దే. ఏలనన, వస్త్వంతర్గతమై చిరస్థాయి సందుకతన కాని రసము ఎన్నటికయినను ఎవ్వఁడయిన నొక కవి చే ననుభవింపఁబడి వ్వక్తము గావింప బడవలసిన దే కానీ స్వయం ప్ర కౌశముగ విలసిల్ల జాలదు

రసికునకును రసమునకును గలయన్యో న్యాశ్రయసంబంధము.

.

కావున రసమునకును రసికునకును నన్యోన్యాశ్రయత్వ మున్నది. ఈభావమునే టెన్నిసన్ అనునాంగ్లేయళవి సోదరకవియగు స్విక్ బరను ప్రశంసించు సందర్భమున నిట్లు వాక్రు, చ్చెను. - నామిత్రుఁడు ప్రపంచమునెల్ల గానముగఁ బాడు వేణువు. ఇందులకు సందియము లేదు.' ఈమాటల కర్ణము కొంచెము గమనింతము! ప్రపంచముయొక్క రససంపదను వేణువుంబోలె గాన రూపమున నాకవి వర్ణింపఁగలఁడనియే. ఇచ్చటఁ గవి వేణు వెట్లు నిమి త్తమాత్రముగ వాయువునందు గర్బితమై యున్న సంగీత శక్తిని మాధుర్యవిశేషమును సంగుళీనిక్షేపమూలమున గానరూపమునఁ బ్రదర్శించునో, యట్లే తానును బ్రకృతి యందలి మాధుర్యమును గానరూపమునఁ బ్రదర్శించునని భావము స్ఫురించుచున్నది. కవికిని, రసమునకును గలయన్యో న్యాశ్రయత్వము పై యుదాహరణము వలనఁ జక్కఁగఁ దేట పడినది. కవి లేనిది రస ముండదు. రసము లేక కవి యుండ