పుట:2015.372978.Andhra-Kavithva.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9


వచ్చును. 9. ఆధునిక విమర్శనపద్ధతి, ప్రత్యక్ష విషయవర్ణనము, 10 రవీంద్రునివర్గమువారిమతము. “నీతి కావ్యమున ధ్వని మాత్రముగ నుండును.” ముస్లిమ్ వాజ్మయము, రూబయత్తు లను కావ్యములస్వరూపము - సుఫీకవుల పద్దతి నీతికిని రసమునకును సమన్వయ మనఁదగును. కావ్యమునకు నీతి ధ్వని మాత్రముగ నుండవలేను . కావ్యమునకు విశిష్ట నీతి ధర్మములే వర్తించును - కావ్యమునకును వేదాంతమునకును గల భేదము - వేదాంతమునకు నిర్వికారతయు, బుద్ధివి శేషమును నావశ్యకములు - కావ్యమున భావోద్రేకమును జిత్తవికార ములును నావశ్యకములు - మతమునకును గావ్యమునకును గలసంబంధము-1 మతము కావ్యమునకు వలయు విషయసామగ్రిని నేకరించి యిచ్చును. 2 కాని, మతమునకు సమష్టి మానవ శ్రేయ మే లక్ష్యము, కావ్యమున వ్యక్తి యొక్క రసప్రవృత్తియే లక్యుము, కవి మతవిషయములలో రసవత్తరములగు వానినే సంగ్రహించును. కావునమతము కావ్యమునకు సాధనమాత్ర మే యగును-సారాంశములు! - 1.కావ్యమునకు రసమే ప్రధానము. 'రసొత్త కను' అనుసూత్రమును, మదుటుని 'నియతి కృతనియమ రహితాం' అనువ్యాఖ్యానమును నాదరణీయంబులు-ఆధ్యాత్మిక కావ్య మతము , ఆనందకుమారస్వామి, "కావ్యమాధ్యాత్మిక సకి సంజ్ఞా రూపకము”.భారతచిత్ర శిల్పముల సిద్ధాంతము 2 అరవిందఘోషు "ఆధ్యాతి కళక్తియే భారతీయులస్వస్వము”, భారతధర్మస్వరూపము - భారతీయ కావ్య ధర్మము, “కావ్యము మానవాత్మ ప్రకృత్యాత్మ పరమాత్మలకుఁ గలసంబంధమును వర్ణించును" - కావ్యశ క్తియే వాగ్దేవి యనఁదగును. తాంత్రి కులమతను, “పశ్యంతీశబ్దప్రయోగము, దాని భావము- కావ్య