పుట:2015.372412.Taataa-Charitramu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశమున సాగగు ప్రత్తికి తగు గిరాకి లేకున్నది. ఇట్లు మన వ్యవసాయదారులకును కూలీలకును వృత్తి తగ్గుచున్నది. మరియు మంచిదూదికై విదేశములపై ననే యాధారపడుట మన మిల్లుపరిశ్రమ కెప్పటికైనను అనర్థకమే.

తాతా ఈస్థితికి ప్రతిక్రియ నాలోచించెను. ఈజిప్టు మనదేశముకు సమీపము. అందు, ఇటీవల నైలునదిదగ్గర ప్రశస్తమగు ప్రత్తిసాగు ఆరంభించి, తృప్తికరముగ జరుగుచున్నది. తాతా ఈజిప్టువెళ్ళి, అచటి ప్రత్తిసాగు పద్ధతుల స్వయముగ జూచి, అందుండి కొత్తరకపు మేలైన ప్రత్తివిత్తులను నాగళ్ళనుతెచ్చి, ఆవ్యవసాయ పద్ధతులను కొన్ని వీలైన భూములందు స్వయముగా అమలుజరిపించి చూపెను. ఆప్రత్తిసాగుకు కొంత జ్ఞానము, సాహసము, పెట్టుబడి, అవసరములు; అవి యిచ్చటి మామూలు వ్యవసాయస్థులకు లేవు. ఆరంభకాలమున ప్రభుత్వము మిల్లు యజమానులుకూడ నిందుకు రైతులకు తగుప్రోత్సాహ మీయవలెను. ఆసాయమప్పుడు కలుగ లేదు; తక్కినమిల్లు యజమాను లిందుకు తోడ్పడరైరి; అందుచే, తాతా తీవ్రముగ యత్నించినను, ఆవ్యవసాయము దేశమం దంతగా నప్పుడు వ్యాపించలేదు. తాతా తెల్పినను, ప్రభుత్వమును అప్పుడు తగుశ్రద్ధ వహింపలేదు, ఆప్రత్తి యీదేశమున పండదని వారెంచిరి. కాని తరువాత ప్రభుత్వశాఖవారు కొందరు మిల్లుయజమానులునుగూడ, తాతా కనపర్చిన పద్ధ