పుట:2015.372412.Taataa-Charitramu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిని, సింధు కతియవారు ప్రాంతములందు, అట్టి ప్రత్తిని పండించిరి. అందుచే తాతాగారి ఆయత్నము సవ్యమే అని స్పష్టమయ్యెను.*ఆప్రకార మిటీవల నవీనపద్ధతులతో చాలచోట్ల, ఈ కొత్తరకముల ప్రత్తిని రయితులును పండించగల్గుచున్నారు.


___________
  1. * బ్రిటిషుదేశమున సన్నబట్టల మిల్లులు హెచ్చుగకలవు. అందుకు వలయుదూదికై యెల్ల కాలమును అమెరికాపై నాధారపడక, సామ్రాజ్యమందే అట్టిప్రత్తిని పండింపవలెనని, బ్రిటిషు పారిశ్రామికులు నిశ్చయించిరి. అంతట ప్రభుత్వసహాయముతో నీజిప్టులో కొంతమంచిప్రత్తి సాగుచేయబడెను. ఇట్లే భారతదేశమున ఇట్టిప్రత్తి పండుచో, ఆదూదిని ఆంగ్లసీమకు చౌకగ తెప్పించు కొనవచ్చును. అందుకు ప్రత్యామ్నాయముగ తిరుగ స్టీమరులందు కిఫాయతీరేటుపన్నుతో తమసీమబట్టలను మనదేశమున దింపి యిచట విక్రయించుట లాభకరమగును. బ్రిటిషువర్తకుల ప్రోత్సాహముతో ప్రభుత్వమువారు శ్రద్ధవహించి ఇటీవల మంచి ప్రత్తిపండించుట కేర్పాటుల జేసిరి.