పుట:2015.372412.Taataa-Charitramu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6. కొన్ని వ్యాపార సమస్యలు : ప్రత్తి పంట.

ఇట్లామిల్లులు వృద్ధియైనంతట, వానిని తాతాయుద్యోగస్తులే ఆయనపద్ధతులతో స్వయముగ నడుపదొడగిరి. ఇట్లు కలిగిన తీరికతో, ఈవ్యాపారసంబంధమగు కొన్నిముఖ్య సమస్యలను జంషెడ్జి పరిష్కరింప యత్నించెను. అందు ప్రత్తి వ్యవసాయము, నౌకావ్యాపారము, కార్మికసమస్య, దూదిసరుకులపై పన్ను, ముఖ్యములు.

మనదేశపు రయితులు సాధారణముగా చాలబీదలు, చదువులేనివారు; నవీనపరిశోధనలు, వానిని వ్యవసాయముకు వినియోగించు విధములు, వారికి తెలియవు. చిరకాలమునుండి కురచపోచగల మామూలు ప్రత్తినే చాలవరకిప్పటికిని మనరయితులు పండించుచున్నారు. ఆప్రత్తినుండి సన్ననూలు వచ్చుట దుర్లభము. పొడుగుపోచగల్గి సన్ననూలు నీయగల జడప్రత్తి, కంబోడియాప్రత్తి, మున్నగు రకములను ధారళముగా పండించుటకవలంబించు పద్ధతులను కొందరు విద్యావంతులు విదేశములందు నేర్చుకొని, అట్టిప్రత్తిని ఆయాప్రాంతములందు పండించి, రయితులకు చూపినచో, వారు నేర్చుకొందురు; అట్టి మంచి ప్రత్తిసాగు మనదేశముననిట్లు క్రమముగ వ్యాపించును. వానితో మనమిల్లులందు సన్ననూలునే తీయవచ్చును. అట్టిదూది మనదేశమున సమృద్ధిగా లేక, దానిని సన్ననూలుకై యితరదేశముల నుండి చాల సొమ్మిచ్చి తెప్పించుకొనవలసి వచ్చుచున్నది; మన