పుట:2015.372412.Taataa-Charitramu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరీక్షించి, అంతట నచ్చటి మంచివిత్తుల దెచ్చి, అనుకూలమగు పొలములందు స్వయముగ మంచి ప్రత్తిని పండించెను. ఆదూదితో మంచి సన్ననూలు వచ్చెను; అంతట మాంచస్టరుమిల్లుకు తీసిపోని మిల్లును బొంబాయి ప్రాంతమున స్థాపించి సన్ననూలు తయారు చేయుటకు జంషెడ్జి నిశ్చయించెను.

బొంబాయినగరముకు 9 మైళ్ళ దూరమందున్న 'కుర్లా'లో ఒక పాతమిల్లు యేలముకు వచ్చెను; దాని యజమాను లప్పటికి నాలుగుసార్లు దివాలా దీసిరి. అది అచ్చిరాదని, ఇతరులు పాట వేయలేదు. తాతా దానిని 1886 లో చౌకగ కొనెను; కాని దానిముఖ్య యంత్రములు సన్ననూలు పనికి సరిపోనివి. ఆచుట్టుపట్ల తగు కార్మికులును లేరు; కాని ధీరుడగుటచే, తాతా వెనుదీయక, ఆప్రాతమరలను పనిముట్లను తీసివేసి, ప్రశస్తమగు కొత్తరకపు యంత్రముల నింగ్లండునుండి తెప్పించి, అందమర్చెను. ఈకొత్తయంత్రాలయముకు 'స్వదేశీ మిల్స్‌' అని పేరిడెను.*[1] ఈమిల్లులో 1892 సం. నుండియు 80 వ నెంబరుకు సరిపోవు సన్ననూలు తయారగుచున్నది. మొదట కొంతసొమ్ము నష్టమువచ్చినను, క్రమముగా నది యార్థికముగాను జయప్రదమై యెంప్రెసు మిల్లువలె నయ్యెను. అంతట మరికొన్ని కంపెనీల

  1. * అప్పటికి 'స్వదేశి' ఉద్యమ మారంభించలేదు; అందువలన 'స్వదేశి' పదము కంతగా ప్రచారములేదు. కాని విదేశవస్త్రముల దిగుమతిని తగ్గించి, అట్టి సన్ననివస్త్రములనే స్వదేశీయములను జనుల కందించుట కామిల్లు నుద్దేశించినందున, తాతా దీనికట్లు పేరిడెను.