పుట:2015.372412.Taataa-Charitramu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5. వస్త్ర పరిశ్రమ : స్వదేశీ అడ్వాన్సు మిల్లులు.

పదేండ్ల నిరంతర కృషిపైన, ఎంప్రెసు మిల్లువలన తాతాకు చాల ద్రవ్యము చేరెను; అంతట దానితో జంషెడ్జి మరొక రీతి మిల్లును పెట్టదలచెను; అప్పటి కింకను బొంబాయి మిల్లులన్నియు ముదుకునూలువే; సన్ననూలుకు, ఆయంత్రములు, ప్రత్తిగూడ, మారవలెను. ఆంగ్లదేశపు మాంచెస్టరులో వాడు కండెలు మగ్గములు సున్నితములు; అవి హెచ్చు కిమ్మతువి; మరియు తమ వాడుకలో లేని కొత్తయంత్రముల దెచ్చుటకు బొంబాయి మిల్లుదార్లు వెనుదీయుచుండిరి. కాళిదాసు కాలమునుండి హెచ్చరిక కల్గుచున్నను అన్ని విషయములందును పూర్వపద్ధతులన్న మనకు విశేషాదరము.*[1] విదేశమున సన్ననూలు వచ్చు కొత్తయంత్రముల దెప్పించి వాడుదు మని తాతా ప్రోత్సహించెను; కాని తక్కిన మిల్లుదా ర్లందుకు సిద్ధపడరైరి.

మన దేశమున సామాన్యముగ పండించు ప్రత్తిపోచ పొట్టిది; దానినుండి సన్ననూలు వచ్చుట కష్టము. తెగకుండ సాపుగ సన్ననూలు నిచ్చు ప్రత్తిరకముల పండించుట యవసరము. ఆరకములు అమెరికా ఈజిప్టులలో వాడుకలో నున్నవి. తాతా మొదట నీజిప్టువెళ్ళి, అందుండి మంచిదూదిని తెప్పించి

  1. * 'పురాణ మిత్యేవ నసాధు సర్వం, నచాపి సర్వం నవమిత్యవద్యం: సంత:పరీక్ష్యావ్యతరద్భజంతే, మూఢ: పరప్రత్యయ నేయ బుద్ధి:' కాళిదాసుని మాళవికాగ్ని మిత్రము; కాళిదాసు జీవించి యిప్పటికి అథమము 1500 వత్సరములై యుండును.