పుట:2015.372412.Taataa-Charitramu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారును దాని ననుకరించిరి. అందు కొంకొక కారణమును తోడ్పడెను.

ఇదివరలో బొంబాయిలో 20, 30, వ నెంబరుకు లోపగు ముదుకనూలే తయారగుచుండెను. (ఎంప్రెసుమిల్లుది మాత్రము నె 45 రు వరకుండెను.) ఆబట్టలను మనదేశమున బీదలే కట్టుచుండిరి. నవనాగరికత హెచ్చినకొలదిని, మనవారిలో చాలమంది సన్నబట్టలనే ధరించుచున్నారు; అవి విదేశపు వై యుండెను. అందువలన మన మిల్లుదార్లు తమ సరుకులలో చాలభాగము (ఇచట విడుదల కానందున) ఓడలపైన చీనా జపాను దేశముల కెగుమతిజేసి, ఆదేశీయులకు విక్రయించు చుండిరి. ఇట్లుకొన్నియేండ్లు జరిగెను; కాని యింతలో జపానులో పెద్ద పరివర్తనము జరిగెను.

చీనాజపానులు చాలకాలము పశ్చిమదేశములతో సంబంధము నొల్లకుండెను. 1867 లో జపానులో నీస్థితిమారి, నూతనశక మారంభించెను. జపానీయులు యూరపు అమెరికాలు ఆర్థికాభివృద్ధి జెందుచుండుట కనిపెట్టి, ఆనవనాగరికతను తామునవలంబించిరి; తమ చక్రవర్తి ప్రోత్సాహముతో, జపానీయయువకులా విదేశముల కేగి, అందుకర్మవిద్యలను యంత్ర పరిశ్రమపద్ధతులను నేర్చుకొని, జపానులో మంచిమిల్లుల నేర్పర్చిరి. అంతట జపానులోనే మంచివస్త్రములు చౌకగ తయారుకాజొచ్చెను. మనదేశమునుండి వస్త్రముల గొనుటమాని, ఆద్రవ్యమును జపానీయులు