పుట:2015.372412.Taataa-Charitramu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తలపెట్టిన బాంకుయత్నమును మాని, తన అసలుకంపెనీ యా దివాలా యుప్పెనలో బడకుండ జాగ్రత్తతో నతడు కాపాడెను. బ్రిటిషువర్తకులకు నచ్చజెప్పి, వారికి దామీయవలసినసొమ్ముల వాయిదాలపైన నిచ్చుట కేర్పర్చి, తమపరపతికి భంగము లేకుండ జేసికొనెను. తాతా ఋజుత్వము న్యాయవర్తనము జూచి, సంతసించి, బ్రిటిషువర్తకు లాయేర్పాటుల నంగీకరించిరి. బ్రిటనులో నిలువయున్న తమకంపెనీవారి దూదిబేలులనెట్లో సొమ్ముచేసికొని, జంషెడ్జి బొంబాయిచేరి, తమమూలసంఘము నెట్టెటులో రక్షించెను; ఆయన న్యాయశీలతను బట్టి బాకీదార్లు సమాధానమొందిరి. బొంబాయిలో నిలవయున్న సరుకులగూడ నెట్టెటులో యమ్మి, అందుచేవచ్చిన స్వల్పద్రవ్యముతో తాతాకంపెనీ నిదానముగ మరలవ్యాపారమారంభించెను.

అప్పుడు తాతాకు కాకతాళీయముగ నొకపెద్దబేరము లభించెను. ఆఫ్రికాలో తూర్పుభాగమున 'అబిసీనియా' దేశము కలదు. అందుకొంతభాగమడవులు, కొండలు, మిగిలినదియెడారి. 1867 లో, అచటిరాజు కొందరాంగ్లేయులపై కోపించి, వారిని ఖైదులో నుంచెను. వారలవిడిపించుటకు రాయబారములు జరిగియు వ్యర్ధమయ్యెను. అంతట బ్రిటిషుప్రభుత్వమువా రబిసీనియాపై యుద్ధమారంభించిరి. మనదేశము అబిసీనియాకు దగ్గర; రెంటిమధ్య, అరేబియా సముద్రమేయడ్డము; బ్రిటిషునాయకత్వమున మనదేశీయుల సేనతో అబిసీనియాను జయించుట సుల