పుట:2015.372412.Taataa-Charitramu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భము †[1] అందుచే 'నేపియరు' దొరగారి సేనానిత్వమున నొక భారతీయసేన మనదేశమునుండి యాదండయాత్రకు పంపబడెను. ఆసేనకు వలయు వస్త్రాహారది సామగ్రినంతను సకాలమున సమకూర్చుటకు, మనప్రభుత్వమువారు కొందరు బొంబాయివర్తకులతో ఖరారునేర్పర్చుకొనిరి. అదిగుత్తబేరము: ప్రభుత్వమువా రేకముగ కొంతసొమ్మునిత్తురు; ఆయుద్ధకాలమున నాఫ్రికాలో నాసేనకవసరమగు సామగ్రినంతను ఆవర్తకులు పంపవలెను. సామగ్రుల హెచ్చుతగ్గులబట్టి కలుగు లాభనష్టములావర్తకులవే. ఇందు తాతావారును ముఖ్యభాగస్థులు. కొంతసామగ్రితో మనసేన యబిసీనియాకు దాడివెడలెను. తీవ్ర యుద్ధము జరుగునని, మహాగహనమగు ఆదేశపుకొండలను లోయలనదులను దాటి రాజధానిజేరుటకు చాలయేండ్లు పట్టునని, అందుకు హెచ్చుసామానులనింకను చాలసారులు పంపవలసియుండునని, అందరును తలచిరి; ఆభావమున నావర్తకులకు గుత్తసొమ్ము కొంతహెచ్చుగా నిర్ణయమయ్యెను. కాని ఫిరంగులుమున్నగు అయోమయములగు నాగ్నేయాస్త్రములతో నాంగ్లభారతవాహిని దండెత్తివచ్చి పైబడుచున్నదని వార్తవినినంతట, అబిసీనియారాజు తానోడుదుననిభీతుడై, పరాజితుడై కష్టములబడుటకన్న చావుమేలని, ఆత్మహత్యచేసికొనెను. రాజు పోగనే, అబిసీనియాసైనికులు చెదరి

  1. † ఆంగ్లదేశమునుండి అబిసీనియాకు సేనలబంపుచో బ్రిటిషువారికి చాల హెచ్చువ్యయ ప్రయాసములు గల్గును.