పుట:2015.372412.Taataa-Charitramu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దూదివ్యాపారపు ధనప్రవాహమును, కేవలము తాత్కాలికమే యనుసంగతిని వారుమరచిరి. వారిట్లుకష్టార్జిత ద్రవ్యమునువిచ్చలవిడిగ ధారబోయుచుండగనే, హఠాత్తుగ, 1865 లో అమెరికా సంయుక్త రాజ్యపు యుద్ధము నిల్చిపోయెను. అచ్చటి యుత్తర జిల్లాల సేనలు దక్షిణప్రాంతముపై విజృంభించి, జయించెను; నీగ్రో దాస్యముపోవుషరతున రెండుప్రాంతములకు సంధియేర్పడెను. అంతట, అమెరికానుండి, మరల నింగ్లండుకు దూదియెగుమతి యధాప్రకారము కొనసాగదొడగెను. తమ యవసరమిట్లు తీరినందున, ఆంగ్లేయులు మనదేశపు దూదినికొనుట మానుకొనిరి. ఇట్లు సీమయెగుమతి నిల్చిపోగనే, బొంబాయిలోను బ్రిటిషు రేవులందును నిలువయున్న మనదేశపు దూదిబేలులకు గిరాకి పోయి, ఒక్కసారిగ ధరతగ్గిపోయెను; అమ్మువా రేగాని కొనువారు లేరైరి. హఠాత్తుగ స్థితిగతులు తలక్రిందులై నందున, ఈ వ్యాపారముచేయు బొంబాయివర్తకులకు కోట్లకొలది రూపాయల నష్టము కల్గెను. ఆప్రావిడెంటు కంపెనీలు, చాలమంది పెద్దవర్తకులును, కొన్ని బాంకులునుగూడ, దివాలాతీసెను.

ఈ కల్లోలసమయమునకు జంషెడ్జి వేలకొలది దూది బేళ్ళను లండనులో జేర్చి, అందొకప్రత్యేకపు బాంకును స్థాపించుచుండెను; తాతాకంపెనీకిని అప్పుడపారనష్టము కలిగెను. తమ వ్యాపారమంతకును మూలచ్ఛేదము కలుగున ట్లుండెను; వ్యవహార మపసవ్యమగుటకనిపెట్టి, తాతా నిదానించెను; లండనులో