పుట:2015.372412.Taataa-Charitramu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యిప్పుడు మనదేశమున వివిధశాఖలం దున్నతస్థానముల వహించి, సంఘమున కనేకవిధముల నుపకరించుచున్నారు; వారిలో కొందరుద్యోగులు రాజ్యాంగదక్షులునుకలరు; (బ్రిటిషుపార్ల మెంటులో సభ్యులైన భారతీయులు ముగ్గురును పార్సీలే). పార్సీలకార్యశూరత, దాతృత్వము, వ్యవహారదక్షత ప్రపంచమం దసమానములు. పెద్దపెద్దవ్యాపారములందు వీరికి పెట్టినదిపేరు. 'త్యాగాయసంభృతార్థానాం' అను కాళిదాసునిసూక్తి ఈజాతికి వర్తింప్చును. ఇట్టివిచిత్రజాతియందే మేధావి, కర్మవీరుడు, ఉదారుడు, మహాదాత, వ్యాపారనాయకుడు అగు మన జంషెడ్జి నస్సర్వంజి తాతా జనించెను.



__________