పుట:2015.372412.Taataa-Charitramu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

తాతా చరిత్రము

మిప్పుడు బరోడారాజ్యములోను, దక్షిణప్రాంతము బొంబాయిరాష్ట్రపు గుజరాతుగను, ఉన్నవి). ఈప్రాంతము వింధ్యగిరిపాదములతోను, నర్మదా తపతీనదులతోను, అలరారుచున్నది.

ఆ 'పార్సీ' లిచ్చటి మనరాజుల మన్ననలంది స్వేచ్ఛతో తమ 'జొరాస్టరు' మతాచారముల రక్షించుకొనిరి. ఈప్రాంతపు హిందువులతృప్తికై గోమాంసమును, తరువాత ముసల్మానుల తృప్తికై సూకరమాంసముగూడ, వారు త్యజించిరి. వారు చాల అల్పసంఖ్యాకులయ్యు, నేటివరకు తమమతమును వ్యక్తిత్వమును నిల్పుకొనియున్నారు. అప్పటినుండి ఆప్రాంతపు సూరతు, భారుకచ్ఛము (బ్రోచి), మున్నగు రేవుస్థలములనుండి విశేషముగ కోస్తావ్యాపారము చేయుచున్నారు.

పార్సీలలోను మన హిందువులలోవలె కాలక్రమమున కొన్ని మూఢాచారములు వ్యాపించెను. కాని గతశతాబ్దమున నాంగ్లవిద్య యారంభింపగనే, పార్సీలలో చాల మార్పుకలిగినది. దాదాపుగా వారందరును విద్యావంతులు; వా రాప్రాంతపు 'గుజరాతీ'ని స్వభాషగ జేసికొనిరి; దాని వాఙ్మయము వృద్ధి నొందించిరి. ఆసంఘమున అతిబాల్యవివాహములు లేవు; స్త్రీలకు కొంతస్వతంత్రత కలదు. పార్సీలు వ్యాపారాదులకై తరుచు ఆంగ్లమును హిందూస్థానీని కూడ అభ్యసింతురు. తాము కడు నిడుమలబడియున్నపు డాతిథ్యమొసగి మతస్వాతంత్ర్యమిచ్చిన భారతదేశమే పార్సీలకు స్వదేశమయ్యెను. వారిలో చాలమంది