పుట:2015.372412.Taataa-Charitramu.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కులపైన ప్రభుత్వము పన్ను వేసినప్పుడు, ఆపన్ను మగ్గముల నేతబట్టలకును వర్తించవలెనని, లేనిచో పన్ను లేని చేతిమగ్గపు సరుకుల పోటీవలన మిల్లులన్నిటికిని నష్టముకల్గునని, చాలమంది మిల్లుదారులు వాదించిరి. కాని తాతా అందు కొప్పుకొనక, గృహపరిశ్రమలకు సదుపాయము కలిగి, అందుచే కొందరు నేతగాండ్రు బాగుపడిన, అది మంచిదే యనిచెప్పి, ఆమిల్లుదారుల వారించెను.

ఆయన దయాశీలత దాతృత్వము అద్భుతములు. గొప్ప కోటీశ్వరుడైనను, చాల ఆదాయము వచ్చుచున్నను, చాల మితవ్యయపరుడై, ఆయన సత్కార్యములకుమాత్రము విరివిగా నిచ్చుచుండెను. విజ్ఞానాలయ మహాదానమేగాక, విద్యార్థులకు విద్యాసంస్థలకును లెక్కలేకుండ నిచ్చెను; కాని వీలైనంతవరకు గుప్తదానమేచేయుచుండెను. కాంగ్రెసుకు, అనేక సాంఘికసంస్థలకు, ప్రజోపయోగకరమగు క్లబ్బులకుకూడ, చాల సహాయము చేసెను.

సత్పాత్రదానముకు దీనుల ప్రోత్సాహముకు జంషెడ్జి వెనుదీయ లేదు; కాని విచక్షణలేని, వితరణ ఆయన కిష్టముకాదు. దృఢగాత్రులైనవారు సోమరులై, దేవాలయమో సత్రమోకట్టింతుమని పటాటోపముతో ఏదోపెద్దపేరుపెట్టుకొనియో, వివాహాదులకనియో, వచ్చి యాచించుచుందురు; ఆయన యేమియు వారలకిచ్చుటలేదు. ఆదానమువలన వారిలో ఆత్మగౌరవముపో