పుట:2015.372412.Taataa-Charitramu.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెద్దపరిశ్రమలను అట్టి వైజ్ఞానికపద్ధతిని స్థాపించుటే మార్గమని నమ్మి, ఆయన ఆపరిశ్రమలకై కృషిచేసెను. కాని యాంత్రికపద్ధతిలో కొన్నిలోపములు కలవనియు ఆయన గ్రహించెను. వానిని తగ్గించుట కనేకయత్నముల జేసెను. కార్మికుల కందరకు ఆరోగ్యకరములగు ప్రత్యేకవసతిగృహములను ఆయాకార్ఖానాల దగ్గర విశాలముగ గట్టించి, అందు మంచినీటికి, నీటిపారుదలకు విద్యాలయములకు, వ్యాయామాదులకుగూడ, తగువసతుల గావించెను. వారికి చాల చౌకగ ఆహారవస్తువులను అందించుచుండెను. వారికిని అందలి ఉద్యోగులకును బహుమతులు, ఉద్యోగవృద్ధి, 'బోనసు' అనుపేర లాభములో వాటా కూడ, కల్గించెను. ఉన్నతోద్యోగులకు తనకంపెనీలో డైరక్టరు లగుటకుగూడ అవకాశ మిచ్చెను. ఆపరిశ్రమ తమదే యనుభావము వారికందరికిని కల్గెను.

ఆయన సాధ్యమైనంతవరకు బస్తీల సమ్మర్దము తగ్గునట్లు చేయుచుండెను. ఎంప్రెసుమిల్లును, బొంబాయిలో గాక, అప్పటికి చిన్నవై విశాలమగు నాగపురమునొద్ద కట్టెను. స్వదేశీమిల్లును గూడ బొంబాయినగర మధ్యమునను అచటి మిల్లులయొద్దనుగాక, దానికి కొంచెము దూరమగు 'కుర్లా' అనుచోట ఏర్పర్చెను; 'జిన్నింగుమిల్లు' లను ప్రత్తిపండు ఆయా గ్రామములందే ఏర్పర్చెను; పట్టుపరిశ్రమను విశాలగ్రామములందు గృహపరిశ్రమగనే వృద్ధిచేయించెను. మనదేశపు మిల్లుసరు