పుట:2015.372412.Taataa-Charitramu.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానాభివృద్ధి పరిశ్రమల జయముకు దేశాభివృద్ధికి ముఖ్యావశ్యకములని, ఆయన చాలయేండ్ల క్రిందటనే గన్పట్టెను. ప్రకృతిశాస్త్రజ్ఞానము వృద్ధికానిచో, పాశ్చాత్యదేశములకు జపానుకు ఇప్పటి యార్థికాధిక్యము కల్గియుండదు; రాజకీయప్రాబల్యముకును కొంతవరకదియే మూలకారణము. జంషెడ్జి అనేకవిజ్ఞాన గ్రంథములను గొని చదువుచుండెను. విదేశములందలి గొప్ప విజ్ఞానశాలల బరీక్షించెను. మనదేశీయులు విదేశములం దున్నత విజ్ఞానము గ్రోలునట్లు చేయుటకై, ఆయన కొన్నిలక్షల రూపాయల నిధి నేర్పర్చెను. మరియు మనదేశమందే ఉన్నతప్రకృతిశాస్త్రము నేర్పుటకు, పరిశోధనకు, 30 లక్షల రూపాయల స్థిరమగు ఆస్తినిచ్చి విజ్ఞానాలయము స్థాపించెను. ఇందును భారతీయు లందరికిని ప్రవేశముకలదు. ఆర్థికసమస్యలకు పరిశ్రమలకు సంబంధించిన గొప్ప గ్రంథముల నన్నిటిని తెప్పించి, ఆయన తన గృహమందు గొప్ప వైజ్ఞానికభాండార ముంచెను. ప్రపంచమునగల ఉపయోగములగు విశేషవస్తువులను వివిధఫలవృక్షాదులను ఆయన విదేశయాత్రలందు సేకరించి, ఆశీతోష్ణాదుల ఆవశ్యకతలబట్టి వానిని నవసారిలోనో, బొంబాయి ప్రాంతమందో, బెంగుళూరు సమీపముననో, తోటలలో నాటించి పెంచెను. ఈదేశమున, పాతాళగంగ నూతులను నాయనయే మొదలిడెను.

ఈకాలమున విదేశములందలి సరకులు చాలదిగుమతియగుచున్నవి; మన ఆర్థికస్థితి బాగుపడవలెనన్న, కీలకములగు కొన్ని