పుట:2015.372412.Taataa-Charitramu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిశ్చయించెను; తుదకాపరిశ్రమ లాభకారియౌనని ఆయన ముందే గ్రహించెను. కాని, లాభముమాటయటుండ, ఈజలవిద్యుచ్ఛక్తి పరిశ్రమ అచట కొనసాగుట సాధ్యమని దాదాపు యెవరికిని అప్పటికి నమ్మికలేకుండెను. తాతావారి నిరంతరకృషివలన తుదకాపరిశ్రమయు జయప్రదమయ్యెను. దీని జయమును జూచి ప్రభుత్వము వారిప్పుడు పైఖారావిద్యుచ్ఛక్తిని స్థాపించినారు. మరియు ఈ దేశమున హిమాలయాద్రి ప్రాంతములందు చాలచోట్ల పెద్దజలపాతములు కలవు. అట్టిచోట్ల ముందింకను ఈ పరిశ్రమ లేర్పడుటకు తాతా యుద్యమము మార్గదర్శకమగును.

ప్రతిచర్యలోను ఆయన సంఘక్షేమమునే మనస్సునందుంచుకొనెను. జంషెడ్జికి స్వసంఘమగు పార్సీజాతియం దభిమానముండెను, కాని ఆయన సాంఘికదురభిమానముగాని, ఇతర సంఘములపైన నెట్టిద్వేషముగాని లేనివాడు. అందుచేతన సంస్థలవలని లాభమును భారతీయు లందరికి నిచ్చెను. ఆయనకు కులతత్వము, ప్రాంతీయభావము, లేవు. (తాతాసంస్థలు బొంబాయి యందే గాక వీలునుబట్టి నాగపురము బెంగుళూరు బొహారుప్రాంతము మున్నగు అన్నిప్రాంతములందును స్థాపింపబడినవి). భారతీయు లేకజాతియగుటచే, పరస్పరవిభేదములు తొలగి యైకమత్యము గల్గియుండవలెనని, తోటిపార్సీల నాయన ప్రోత్సహించుచుండెను.