పుట:2015.372412.Taataa-Charitramu.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సున్నపుగుట్టలు, బొగ్గుగనులు, సమీపముననే కలవని, ఈదేశమున గొప్పలోహపరిశ్రమ సుసాధ్యమే యని, తరువాత తేలెను.

ఈదేశమున గొప్పలోహపరిశ్రమ స్థాపించునట్లు ఆంగ్లదేశపు కోటీశ్వరులగు వ్యాపారనాయకులను ప్రోత్సహించి, అప్పటిరాజప్రతినిధియగు కర్జను ప్రభువుగారు చాలప్రయత్నించెను. (ఆయన మనదేశమందలి గనుల కౌలుషరతులనుగూడ సులభముగ చేసెను.) కాని, ఇట్టిప్రశస్తమగు లోహఖను లచ్చట కలవని అప్పటికి వారికి తెలియదు. ఆయన యుద్దేశించిన బ్రిటిషుపారిశ్రామికు లెవరును అప్పు డందుకు సిద్ధపడలేదు. ఈలోగా జంషెడ్జితాతాయే అందుకు సిద్ధపడి, ఆపరిశ్రమకు పునాదివేసెను. *[1]

ఇట్లే నేలబొగ్గు చౌకగను సమృద్ధిగను దొరకని బొంబాయి ప్రాంతమున నింకొక బలీయమగు చోదకశక్తి నెట్లైన సాధింపవలెనని ఆయనకు తోచెను. ఇంజనీర్లతో నాలోచించి, ఆయన పడమటికనుమలనుండి జలపాతముద్వారా విద్యుచ్ఛక్తిని సాధింప

  1. * Lovat Fraser గారి India under Curzon and after అను గ్రంధమును, అందు ముఖ్యముగ 321 వ పుటలోని ఈక్రిందివాక్యమును చూడుడు. "Lord Curzon afterwords tried without success to induce prominent English capitalists to start great iron and steel works in India, and possibly nobody was more surprised than the Viceroy when the courageous and prescient Indian, the late Mr. Jamshedji Tata. Volunteered to undertake the task."