పుట:2015.372412.Taataa-Charitramu.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంపుచు, పారిశ్రామికములగు కొన్నివిదేశములనుండి తయారగువస్తువుల రప్పించుకొనుచుండవలెనని, చెప్పుచుండుట సాధారణముగ వాడుక; ఈ అపవాదము నిరాధారమని జంషెడ్జి మొదటనే తలచెను.

పూర్వము మనదేశమున నశ్వరముకాని యద్భుతముగు కుతుబ్‌మినారు బోలు ఇనుపకట్టడము లేర్పడెను. చిత్రవిచిత్రములగు రకరకముల ఖడ్గములు తయారై, అప్పటినాగరికలోకముకంతకు నెగునతియాయెను. అందుచే, పెద్ద లోహఖను లీదేశమున చక్కని సన్ని వేశములతో నుండితీరవలెను. మనదేశపు సహజసంపత్తి యత్యధికము; ఇచ్చట అన్నివిధములగు శీతోష్ణ పరిస్థితులు, దాదాపు సకలవస్తువులు తయారగు వివిధతత్వముల భూతలములును, కలవు. మరియు ఆయాప్రాంతపు భూగర్భమున వివిధములగు గనులును గలవు. బాగుగపరిశోధనజరిగినచో, తగు లోహఖనులు దొరికితీరునని, ఆయనకు దృఢవిశ్వాసముండెను. కనుక కొందరు నిరుత్సాహపర్చినను, ఎన్ని చోట్ల తనప్రయత్నము విఫలమైనను, జంకక, ఆయన యనుభవముగల, గొప్పభూతత్వజ్ఞులను, ప్రసిద్ధులగు వాస్తువిజ్ఞులను, స్వయముగ రప్పించి, ఇదివరలో నెవరును శోధించని కొండలను, అడవులనుగూడ, విశేషవ్యయ ప్రయాసలకు లోనై పరీక్షించెను; తనపుత్రమిత్రులు గూడ నట్లేచేసి సాధించునట్లు వారలను ప్రోత్సహించెను; ఆశ్రమఫలితముగనే, మనదేశమున ప్రశస్తమగు లోహఖనులు,