పుట:2015.372412.Taataa-Charitramu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్రవ్యవిజ్ఞానానుభవములు పలుకుబడియు గల విదేశీయులే ఫాక్టరీలగట్టి, గనుల యజమానులై, ఆపరిశ్రమలకు మనదేశమున స్థాపించియుందురని తోచును.

వంగ దేశమున భారతీయులు ముందుగా శ్రద్ధవహించనందున, కలకత్తాప్రాంతపు జూటు (=జనపనార) సంచుల పరిశ్రమను, చాలవరకు బొగ్గుగనులను, కొంతవరకు కాకితపుమిల్లులు మున్నగు వానిని, విదేశీయులే నడుపుచున్నారు*[1] ఆవిదేశీయ సంఘములాపరిశ్రమల వృద్ధిచేయుచు, లాభ ద్రవ్యమును తమదేశముకు గొనిపోవుచున్నారు. ఆపరిశ్రమలందు భారతీయులకు తగు అనుభవము ప్రాబల్యము లేదు. జంషెడ్జితాతా మున్నగువారు సన్న నూలుబట్టల మిల్లులను స్థాపింపనిచో, వానినిగూడ విదేశీయులే స్థాపించియుందురేమో! ఈదేశమందు అట్లే తాతా సంఘపు దూరదృష్టి చాకచక్యములు లేకుండినచో, సాక్షిలోహపరిశ్రమ, బొగ్గుగనులపరిశ్రమ, సహ్యాద్రిలోని జలవిద్యుచ్ఛక్తి పరిశ్రమ, విదేశీయులహస్తగతమై యుండును; వాని లాభమందును, శిల్పానుభవమందును, యాజమాన్యమందును, భారతీయులకు తావే లేకపోయెడిది.

(ధాన్యము దంపుట, బెల్లము చేయుట, వడ్రపుపనులు, వడకుట, నేత, మున్నగు పరిశ్రమలు వ్యవసాయజనూకు చాల

  1. * ఇట్లే మనమద్రాసు ప్రాంతమున కొన్ని బట్టలమిల్లులు మైసూరులో స్వర్ణపరిశ్రమ, ఇత్యాదులను విదేశీయులే నడుపుచున్నారు.