పుట:2015.372412.Taataa-Charitramu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సహకారులు, మన గ్రామజీవనమునకు చాల ఉపయోగకారులు. వీనితో యాంత్రికపరిశ్రమలు పోటీచేసి, వీనిని నశింప జేయుట భావ్యముకాదు. కాని, అంతమాత్రమున, యాంత్రిక పరిశ్రమ లసలే యవసరముకావని భావించుట ఉచితముగ తోపదు)

విదేశపుయంత్రములందును విదేశీయాజమాన్యపు యంత్రములందును తయారగు వస్తువులకన్న, ఈదేశీయుల సరకులనే వాడుట ఆర్థికముగ శ్రేయస్కరము.

ఈదేశమందు పెద్దపరిశ్రమల స్థాపకులలో ప్రముఖుడు తాతా; ఇంతేగాక, గృహపరిశ్రమాభిలాషులును తాతాజీవితమునుండి చాలసంగతుల నేర్చుకొనవచ్చును. ఆయన గొప్ప దేశాభిమాని, ఆర్ధిక వేత్త. ప్రపంచపు ఆర్థికహితైషులందరకు ఆయన చర్యలు మార్గదర్శకములు.†[1]

ఈదేశమున కవసరములు, ఇతర పరిశ్రమలకు కీలకములు, అగు వానిపైననే జంషెడ్జి తనదృష్టిని నిగుడ్చెను. తనకు లాభకరములే గాక దేశాభివృద్ధి కవసరములగు క్రొత్తపరిశ్రమలనే

  1. † పరిశ్రమలం దారితేరిన పాశ్చాత్యులకును ఆయనజీవితము హిత బోధకమగుటవలననే, జంషెడ్జితాతా చరిత్రమును, ఇదివరలో లండనులోను ఇప్పుడు ఆక్సుఫర్డులోను ఉపన్యాసకుడైన యఫ్. ఆర్. హారిసు అను అర్థశాస్త్రపండితుడు 1925 లో మనోహరముగ రచించెను; దాని నాక్సుఫర్డు యూనివర్సిటీ ప్రెస్సువా రింగ్లండులో ముద్రించి ప్రచురించిరి. ఇదియు జంషెడ్జి ఘనతకు జగద్విఖ్యాతికి నిదర్శనము.